Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
want to act in JD cinema??

ఈ సంచికలో >> సినిమా >>

నటిగా ఏఎన్ఆర్ కుమార్తె

anr daughter in movies

అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ (బాల నటుడిగా కన్పించాడు ‘సిసింద్రీ’లో) సినీ రంగంలో వున్నారు. అక్కినేని కుటుంబం నుంచి సుమంత్‌, సుశాంత్‌ కూడా సినీ పరిశ్రమలో ఎంతో కొంత పేరు సంపాదించుకోగా, అక్కినేని కుటుంబం నుంచి ఓ మహిళ నటిగా ఎంట్రీ ఇస్తున్నారు.

ఆమె సుశాంత్‌ తల్లి నాగ సుశీల. ఇప్పటివరకూ నిర్మాతగానే వున్న నాగసుశీల, సుశాంత్‌ తాజా సినిమా ‘అడ్డా’ ప్రమోషన్‌ సాంగ్‌లో నటించారు. ప్రమోషన్‌ సాంగ్‌లో కన్పించినా నటించినట్లే లెక్క కదా. డీసెంట్‌ లుక్‌తో వున్న ఆమె, నటిగా తెరపై కన్పించాలనే ఆసక్తి ప్రదర్శిస్తే అక్కినేని కుటుంబం నుంచి ఓ మహిళ నటిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకోవచ్చు.

ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో అక్కినేని మనవరాలు సుప్రియ హీరోయిన్‌గా నటించింది. అదే ఆమెకు తొలి, ఆఖరి సినిమా. ఆ తర్వాత సుప్రియ సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు.

మరిన్ని సినిమా కబుర్లు
who is that  secret actor?