Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

raja music muchchatlu

పకడో పకడో
ఇక్కడున్న సీడీ , డీవిడీ కవర్లు చూశారు కదా ... జయసింహ, జగదేకవీరుని కథ కలిపి వున్న దగ్గిర ఎన్.టి.ఆర్. ఫొటోలు కొద్ది మార్పులతో ఒకేలా వున్నాయి. జయసింహ పేరుతో వున్న కవర్ల మీద ఎన్.టి.ఆర్. గెటప్పులు రెండు రకాలుగా వున్నాయి. ఇంతకీ ఏ గెటప్ ఏ సినిమాకి సంబంధించినది?

జాగ్రత్తగా గమనిస్తే జయసింహ 1955 లో వచ్చింది. జగదేకవీరుని కథ 1961 లో వచ్చింది . ఈ ఆరు సంవత్సరాలలో శారీరకంగా ఎన్.టి.ఆర్. లో వచ్చిన మార్పుల బట్టి జయసింహ లో వున్న గెటప్ ని పట్టుకోవచ్చు. మూడు ఫొటోలూ వున్న కవర్ మీద 3 వ నంబర్ వేసి వున్న గెటప్పే జయసింహ లో ఎన్.టి.ఆర్. అసలైన గెటప్. 'ఓ చెలీ ఒహో సఖి ఒహో మదీయ మోహినీ' అనే పాట గుర్తున్నా, ఆ పాటని చూసే అవకాశం వున్నా జగదేక వీరుని కథ లో ఎన్.టి.ఆర్. గెటప్ ఏదో ఇట్టే గుర్తుపట్టెయ్యొచ్చు. దానికి 2 వ నంబర్ వేసి వుంది.
ఇక 1 వ నంబర్ వేసి జయసింహ పేరుతో వున్న గెటప్ అసలు స్టిల్ దొరకక ఎడ్జెస్ట్ చేసేసినది. జగదేక వీరుని కథ స్టిల్ ని తీసుకుని తల భాగాన్ని కట్ చేసి బాడీ పోర్షన్ ని రివర్స్ చేసి , కొంచెం ఎన్లార్జ్ చేసి, కలర్ మార్చి,  కట్ చేసి వుంచుకున్న తల భాగాన్ని బాడీ తగ్గట్టు పెంచి అతికించారు. అదీ సంగతి.

కవులేం 'రాసిచ్చినా' 'రాజు'కుంటుంది, 'రాణి'స్తుంది
ఓ ఫంక్షన్ లో వెన్నెలకంటి, చంద్రబోస్ కలిశారు.

" ఏవయ్యా .. ఎంత చేతిలో పెన్నుంటే మాత్రం ప్యాలెస్ లకు ప్యాలెస్ లు రాసిచ్చేస్తావా !?" అడిగారు వెన్నెలకంటి

"ఊర్కోండి సార్ ... మీ కన్నానా ... నేను ప్యాలెస్ లే ఇచ్చాను. మీరేమో ఏరియాలకు ఏరియాలే రాసిచ్చియ్యెట్లేదా !?" అన్నారు చంద్రబోస్.
చుట్టూ చేరిన వాళ్ళకు ఒక్క ముక్క అర్ధం కావటం లేదు.  వీళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారా తర్వాత కొట్టుకుంటారా ఎవరేం అంటారో అనే టెన్షన్ మొదలయింది. వాళ్ళిదరూ మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళిపోయారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ....
చిరంజీవి నటించిన 'ఇద్దరు మిత్రులు' సినిమాలో చంద్రబోస్ 'మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా - పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా" అంటూ రాశారు. అది దృష్టిలో పెట్టుకుని వెన్నెలకంటి ఓ చలోక్తి విసిరారు.

బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి' సినిమాలో ''రావయ్యా ముద్దుల మావా ... నీకు రాసిస్తా రాయలసీమా' అంటూ రాశారు వెన్నెలకంటి.  ఇది దృష్టిలో పెట్టుకుని చంద్రబోస్ కౌంటర్ గా అన్నారు. అది ఇద్దరికీ అర్ధమయింది. అందుకే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

ఈ పాట వివరాలు తెలుసా ?
' సీమ టపాకాయ్' సినిమా చాలా మంది చూసే వుంటారు. అందులో 'ఓం నమో వెంకటప్పాయ' అంటూ మొదలయ్యే పేరడీ సాంగ్ ని ఎంజాయ్ చెయ్యని వారుండరు. టీవేలో ఆ పాట వస్తే పూర్తయ్యే వరకూ చానల్ మార్చరు కూడా. ఆ పాట సంపాదించుకున్న పాపులారిటీ అలాటింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే - ఇంత ప్రజాదరణ పొందిన ఈ పాట ఆడియో సీడీలో లేదు. సినిమా టైటిల్స్ కూడా ఈ పాట ఎవరు రాశారో, ఎవరెవరు పాడారో లాంటి వివరాలు లభించవు. రచయిత భాస్కరభట్ల ద్వారా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారిని పట్టుకుని అడిగితే ఆయన కూడా కొన్ని రోజుల పాటు వెతికి అందించిన వివరాలు ఇవి:-

ఈ పేరడీ సాంగ్ రచన : చందు
పాడినది : రేవంత్, అభినయ్, ధనుంజయ్, శ్రావణ భార్గవి, దీప్తి ఆచార్య, ఉమానేహ

మరిన్ని సినిమా కబుర్లు
nobel prize for telugu writer?