Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
I AM NOT SACHIN

ఈ సంచికలో >> సినిమా >>

ఆమ్‌ ఆద్మీ సినిమా

Aam Aadmi cinema

పుడుతూనే సంచలనాలు నమోదు చేసిన పార్టీ ‘ఆమ్‌ ఆద్మీ’. ఆ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. కామెడీ నటుడు ఎం.ఎస్‌.నారాయణ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అచ్చం ఆమ్‌ ఆద్మీ అధ్యక్షుడైన అరవింద్‌ కేజ్రీవాల్‌ని పోలి ఉండేలా ఎమ్మెస్‌ నారాయణకు గెటప్‌ వేశారు. ఎన్నికల వేడిలో ఈ సినిమా రూపొందడంతో ఇది రాజకీయ సినిమానా? అన్న చర్చ మొదలైంది.

‘నేను ఓటేసి సీఎం చేస్తే, రాజీనామా చేయడమేంటి?’ అనే డైలాగ్‌ చెప్తాడు ఎంఎస్‌ నారాయణ ఈ సినిమాలో. అంటే ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలోని సినిమానే అని అర్థం చేసుకోవాలి ఉంటుంది. ‘ఆమ్‌ ఆద్మీ’ అనే టైటిల్‌తో సినిమా రావడం పట్ల ఆ పార్టీ స్పందన ఏమిటో తెలియరాలేదు ఇంకా. ఒకవేళ సినిమా తమ పార్టీకి వ్యతిరేకంగా ఉందని భావిస్తే, ఆ పార్టీ సినిమాకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టవచ్చు.

అయితే ఇలాంటి సందర్భాలలో ఉచితంగా ప్రచారం దక్కుతుందని రాజకీయ పార్టీలు గుంభనంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఎమ్మెస్‌ నారాయణ ‘ఆమ్‌ ఆద్మీ’ సినిమా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పుడే చెప్పజాలం. సినిమా వచ్చాక అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. సినిమా ఎన్నికల్లోగా వచ్చే అవకాశాలు తక్కువ.

మరిన్ని సినిమా కబుర్లు
aa makeup ki award Guarantee