Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiranjeevi sare... mari pawan

ఈ సంచికలో >> సినిమా >>

రాజశేఖర్‌ది మంచి ఆలోచన

Rajasekhardi good idea

రీమేక్‌ సినిమాల విషయంలో రాజశేఖర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువగా ఆయన రీమేక్‌ సినిమాలపై ఆధారపడతారు. మంచి సినిమాల్ని ఎంపిక చేసుకుంటారు కూడా. అయితే సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవడంలో విఫలమవడం, ఇతరత్రా కారణాలతో ఆయన నమ్మిన సినిమాలు కొన్ని తెలుగులో విజయవంతం కాలేదు.

అదలా ఉంచినట్లయితే రాజశేఖర్‌ ఓ తమిళ సినిమాని తాజాగా సొంతం చేసుకున్నారు. దాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారాయన. ‘సూదుకవ్వం’ ఆ సినిమా పేరు తమిళంలో. అక్కడ పెద్ద విజయం సాధించిన సినిమా అది. ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడుకున్న సినిమా కావడంతో ‘సూదుకవ్వం’ సినిమాని తెలుగులోకి తేవాలన్న రాజశేఖర్‌ ఆలోచన మంచిదేనంటున్నారు సినిమా పరిశ్రమలో.

ముందే చెప్పుకున్నట్లు, ఎంత గొప్ప సినిమా అయినా దాన్ని సరిగ్గా హ్యాండిల్‌ చేయగల దర్శకుడు ముఖ్యం. ‘సూదుకవ్వం’ సినిమాని తెలుగులో హ్యాండిల్‌ చేయాలంటే తెలుగు నేటివిటీ మీద పట్టు ఉండడంతోపాటు, సెన్సాఫ్‌ హ్యూమర్‌ కలిగి ఉండాలి. అలాంటి దర్శకుడిని రాజశేఖర్‌ ఎంచుకోగలిగితే ‘సూదుకవ్వం’ సినిమాపై రాజశేఖర్‌ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
eemelo maro laya vundi