Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aam Aadmi cinema

ఈ సంచికలో >> సినిమా >>

ఆ మేకప్‌కి అవార్డు గ్యారంటీ

aa makeup ki award Guarantee

భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’ సినిమాలు ‘మేకప్‌’ విభాగంలో అత్యున్నత స్థాయి సాంకేతిక నైపుణ్యతకు తెరతీశాయి భారతీయ సినీ పరిశ్రమ వరకూ. ఆ సినిమాలు వచ్చినప్పుడు అలా ఎలా మేకప్‌ చేయగలిగారు? అని ఆశ్చర్యపోయారు. ఆ తరువాత చాలా సినిమాలలో అటువంటి మేకప్‌ని ఉపయోగించినప్పటికీ కొన్ని సినిమాల్లో మేకప్‌ స్థాయి ఎబ్బెట్టుగా మారిపోయింది. కొన్ని సినిమాల్లో వాహ్ వా అనిపించేస్థాయిలో మేకప్‌ ప్రతిభను కనబర్చారు కళాకారులు.

తెలుగులో వస్తోన్న ‘లడ్డూబాబు’ సినిమాకి కూడా మేకప్‌ విభాగం గొప్ప గొప్ప ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. అల్లరి నరేష్‌ హీరోగా రవిబాబు రూపొందిస్తున్న ‘లడ్డూబాబు’ సినిమాలో అల్లరి నరేష్‌ గెటప్‌ కోసం మేకప్‌ విభాగం చాలా కష్టపడిరది. ఆ కష్టమంతా ట్రెయిలర్‌లో కన్పిస్తోంది.

‘ఇలా మేకప్‌ చేశారు’ అని అల్లరి నరేష్‌ చెబుతోంటే, ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ సినిమా మేకప్‌కి మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం కలుగుతోంది అందరికీ. మేకప్‌కి అవార్డుల వర్షం కురుస్తుందని సినిమా పరిశ్రమకు చెందినవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేకప్‌ చేశారు అనిపించకుండా, చాలా కన్విన్సింగ్‌గా కనిపిస్తున్నాడు అల్లరి నరేష్‌.

మరిన్ని సినిమా కబుర్లు
chiranjeevi sare... mari pawan