Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aa makeup ki award Guarantee

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవి సరే... మరి పవన్‌

chiranjeevi sare... mari pawan

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళారు, కేంద్ర మంత్రి అయ్యారు. కాని సినిమా పరిశ్రమను వీడారు. అది లోటుగానే భావించాలి. స్వర్గీయ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్ళినా సినిమాలు మానలేదు, తగ్గించారంతే. మోహన్‌బాబు వంటివారు కూడా రాజకీయాలలోకి వెళ్ళినా, సినిమాలు మానలేదు.

ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయం, సినిమా అనే రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేయడం వీలు కాదు. అందుకనే చిరంజీవి, రాజకీయాలకు సమయం కేటాయించి, సినిమాలను మానుకున్నారని అనుకోవచ్చు. చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్‌ కొత్త పార్టీ పెట్టారు జనసేన పేరుతో. ఆ కారణంగా ఆయన కూడా సినిమాలు చేయడం మానేస్తాడేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

చిరంజీవి వదిలి వెళ్ళిన ఖాళీని పవన్‌కళ్యాణ్‌ భర్తీ చేశాడు. చిరంజీవి కుటుంబం నుంచి చరణ్‌, అల్లు అర్జున్‌ ఉన్నా, పవన్‌ సినిమాల్ని వదిలితే, ఆ ఖాళీ భర్తీ చేయడం మెగా ఫ్యామిలీ హీరోలకు కొంత కష్టమే. ఎందుకంటే పవన్‌పై సినీ అభిమానంలోనూ ఓ ప్రత్యేకత ఉందంటారు అతని అభిమానులు. వారి కోసం అయినా పవన్‌ సినిమాల్లో కొనసాగుతాడేమో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Rajasekhardi good idea