Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
eemelo maro laya vundi

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్నికల సీజన్‌లో సినిమాలు

Movies in election season

వేసవి సీజన్‌ అంటే సినిమా పరిశ్రమకు పండగ. వేసవి సెలవుల్లో థియేటర్లకు వచ్చేందుకు సినీ అభిమానులు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. అందుకనే భారీ చిత్రాలు సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేసుకుంటుంటాయి. అయితే ఈ దఫా ఎన్నికల సీజన్‌ నడుస్తుండడంతో, వేసవి సినిమాలు ఎంతవరకు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా రాజకీయాలు సినిమాలపై పెద్దగా ప్రభావం చూపవు. కాని, రాజకీయాల్లో సినిమా గ్లామర్‌ పెరిగిన రీత్యా సినిమాకన్నా, రాజకీయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. దాంతో, టీవీ సెట్లకు అంటిపెట్టుకుని, రాజకీయాల్ని అబ్జర్వ్‌ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు కూడా. అది సినిమా పరిశ్రమకు కొంత ఇబ్బంది కలిగించేదే.

అయితే ఒక్కసారి పెద్ద సినిమా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్నా, చిన్న సినిమాకి సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినా రాజకీయాలనుంచి ప్రేక్షకాభిమానుల దృష్టి మళ్ళీ సినిమాలవైపు వెళ్తుంది. ఇదివరకెన్నడూ లేని స్థాయిలో వివిధ పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతుండడంతో సినిమా పరిశ్రమ, ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తోంది.

రిస్క్‌ లేదనుకున్న సినిమాలు రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకుంటుండగా, రిస్క్‌ ఎందుకని భావించి కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయంట. అవన్నీ ఎన్నికలు అయిపోయాక వరుసగా థియేటర్లలోకి రావొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chooddam