Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Rajasekhardi good idea

ఈ సంచికలో >> సినిమా >>

ఈమెలో మరో లయ వుంది

eemelo maro laya vundi

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించినా, సరైన బ్రేక్‌ కోసం ఎదురు చూస్తోందీ అందాల భామ హరిప్రియ. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే గుణం ఈమె సొంతం. నటనా ప్రతిభ, దానికి తోడు క్లాసికల్‌ డాన్స్‌లో టచ్‌.. ఈమెకు ప్లస్‌ పాయింట్స్‌. ఎన్ని ప్లస్‌ పాయింట్స్‌ వున్నా, అదృష్టం కలిసి రావాలి కదా?

ఆ అదృష్టం ఇతర భాషల్లో ఆమెకు ఎప్పుడో కలిసొచ్చింది. తెలుగులోనే మంచి హిట్‌ కోసం వేచి చూస్తోన్న హరిప్రియ, ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. భిన్నమైన పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోన్న హరిప్రియ, పలు తమిళ, మలయాళ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తెలుగు తెరపై ఒకప్పుడు నటిగా రాణించిన లయలా ఈమె మల్టీ టాలెంటెడ్‌. తెలుగులో హరిప్రియ నటిస్తోన్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ తన కెరీర్‌ని కొత్త పుంతలు తొక్కిస్తాయని హరిప్రియ విశ్వసిస్తోంది. ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
Movies in election season