Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pramukha naastikudu, hethuvadi, samskartha shree goraa garu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (మార్చి 21 - మార్చి 28) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద తలపెట్టిన ప్రయత్నాల్లో విజయంను పొందుతారు. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి నూతనపనులను చేపట్టుటకు అవకాశం ఉంది. మొదట్లో పనుల పట్ల ఉన్న ఉత్సాహం చివరివరకు ఉండకపోవచ్చును. మిత్రులను కలుస్తారు వారిని కొత్త కొత్త ఆలోచనల వైపు ముందుకు పంపించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. విద్యార్థులకు శ్రమించుట వలన ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు ఆస్కారం కలదు. ఉద్యోగులకు అధికారుల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆలోచనల్లో తొందరపాటు వద్దు తోటి ఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది ఆర్థికంగా నూతన అవకశాలు లభించే అవకాశంఉంది. మంచిఅవగాహన ఉంటే పెట్టుబడులు పెట్టవచ్చు. కళారంగంలోని వారికి శ్రమిస్తే మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది తలపెట్టిన పనులలో లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. నలుగురికి ఉపయోగపడే పనుల మూలాన కొంతమందికి సహాయం అందించే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల గురుంచి ఆందోళన పెరుగుతుంది వారికి సమయం కేటాయిస్తారు. విద్యార్థులకు సంతోషం ఉంటుంది చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆశించిన విధంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు నూతన ఆలోచనలు ఉండే అవకాశం ఉంది వాటిని పూర్తిచేయుటకు సమయం కేటాయిస్తారు. అధికారులతో మంచిసంబంధాలు ఉపయోగపడుతాయి. వ్యాపారస్థులకు పనులకు కేటాయించుట ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది కాకపోతే మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోండి మంచిది. విద్యార్థులకు శ్రమతప్పక పోవచ్చును, సమయాన్ని వృధాచేయకండి ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. ఉద్యోగులకు అధికారులతో నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. పనులు కొంత నిదానంగా ముందుకు సాగుతాయి. తోటిఉద్యోగులతో స్వల్పవిభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. వ్యాపారస్థులకు పనిఒత్తిడి ఉంటుంది నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. చిన్న చిన్న పనులను మొదట పూర్తిచేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. కళారంగంలోని వారికి పెద్దల పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారి సూచనలు పాటించుట ఉత్తమం.


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. అనవసరపు ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మీయొక్క ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం ఉంది కాకపోతే సర్దుకుపోవడం మంచిది. కుటుంబంలో స్వల్పమనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది నిదానమ అవసరం. విద్యార్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి పెద్దల సూచనలు, సలహాలను పాటించుట వలన తప్పక మేలుజరుగుతుంది. మంచిప్రణాళికతో ముందుకు వెళ్ళుట మేలు. ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. చాలావరకు వేచిచూసే దోరణి మంచిచేస్తుంది. ఫలితాలు ఆశించక పోవడం ఉత్తమం. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన సమస్యలు కలుగుతాయి అవసరానికి రావాల్సిన ధనం సమయానికి అందక పోవచ్చును జాగ్రత్త. కళారంగంలోని వారికి పెద్దగా అనుకున్న విధంగా ఉండకపోవచ్చును నిదానం అవసరం.

సింహ రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను వారం ఆరంభంలో పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు కాకపోతే ఆరోగ్యంవిషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. వ్యతిరేకవర్గం నుండి కలుగు ఇబ్బందులను తెలివితో ఎదుర్కొనే అవకాశం ఉంది  విజయం పొందుతారు. విద్యార్థులకు బాగుంటుంది కాకపోతే ఆలోచనలను తగ్గించి సమయాన్ని వాడుకొనే ప్రయత్నం చేయుట వలన మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు అందరిని కలుపుకొని వెళ్ళండి లేకపోతే పనుల విషయంలో మాటపడవలసి వస్తుంది. వ్యాపారస్థులకు పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కళారంగంలోని వారికి తోటివారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట సూచన.

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపాలనే ఆలోచన కలిగి ఉంటారు. ప్రయాణాలకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో మీ ఆలోచనలు ఉపయోగపడుతాయి. బంధువులతో ఆలోచనలు చేస్తారు నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. మాటను పొదుపుగా వాడుట మంచిది. విద్యార్థులకు బాగుంటుంది ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మాములుగా ఉంటుంది పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట సూచన. కళారంగంలోని వారికి కుటుంబసభ్యులతో సమయాన్ని గడిపే అవకాశం దొరుకుతుంది. నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని చూపిస్తారు.

తులా రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో శ్రమను పొందుతారు వాటిని నిదానంగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడిపే ఆస్కారం కలదు వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. అధికమైన ఆలోచనలు కలిగి ఉండి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు జాగ్రత్త. విద్యార్థులకు శ్రమించుట ద్వార అనుకున్న ఫలితాలు పొందుతారు. సమయపాలన పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉన్నతలక్ష్యాలను చేరుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగులకు పనులు నిదానంగా పూర్తిఅయ్యే అవకాశం ఉంది. పెద్దల సూచనలు సలహాలను పాటించుట మంచిది. వ్యాపారస్థులకు ఇంటిపెద్ద మూలాన మేలుజరుగుతుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు పొందుతారు ముందుకు వెళ్ళుట మంచిది.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద శ్రమను పొందుతారు అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తిఅయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుట వలన అలసిపోయే ఆస్కారం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యతిరేకవర్గం నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చును. చిన్న చిన్న ప్రయత్నాలు చేయుట ద్వారా లబ్దిని పొందుతారు. అనారోగ్యసమస్యలు సూచితం జాగ్రత్త అశ్రద్ద చేయకండి. విద్యార్థులకు కొంత కష్టకాలమనే చెప్పాలి పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అనుకోని సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు, తోటిఉద్యోగులతో మంచిసంబందాలు కొనసాగించే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును వేచిచూసే దోరణి మంచిది. కళారంగంలోని వారికి మాటతీరు ప్రభావితం చేస్తుంది కావున నిదానం అవసరం.


ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద రాజకీయరంగం పట్ల ఆసక్తిని కనబరుస్తారు పెద్దల సహకరంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యములు జరుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉన్నతమైన లక్ష్యాలను సాదించే ఆస్కారం కలదు. ఉద్యోగులకు అధికారుల మూలాన మేలుజరుగుతుంది. పనులు అనుకున్న సమాయనికి పూర్తిఅవుతాయి. వ్యాపారస్థులకు పెట్టుబడులు పెట్టుటకు మంచి సమయం, లాభంను పొందుతారు. కళారంగంలోని వారికి నూతన అవకశాలు కలిసివస్తాయి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.


మకర రాశి

ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రదేశ ప్రయాణాలు చేయవలసి రావొచ్చును. బంధుమిత్రులతో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారినుండి సహాకారం లభిస్తుంది. మాటలు పొదుపుగా వాడుట సూచన. విద్యార్థులు కొంత శ్రమించుట ద్వార ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పోటీపరిక్షల కోసం సమయం ఇవ్వడం ఉత్తమం. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును కాకపోతే ఇబ్బందులు కూడా పెద్దగా ఉండకపోవచ్చును సర్దుబాటు విదానం మేలు. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ముందుకు వెళ్ళండి. కళారంగంలోని వారికి అనుకోని ఇబ్బందులు కలుగుతాయి మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు నిదానం అవసరం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తియ్యే అవకాశం కలదు. అనారోగ్యం మూలాన కొంత భాదను పొందుతారు కావున తగిన జాగ్రత్తలు చేపట్టుట ఉత్తమం. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది, సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. విద్యార్థులకు బాగుంటుంది మంచి ఆలోచనలు కలిగి వాటిని సాధించే ప్రయత్నం చేయుట అనేది సూచన. ఉద్యోగులకు శ్రమతప్పక పోవచ్చును కావున అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్థులకు పెట్టుబడుల విషయంలో అవగాహనా అవసరం నిదానంగా ముందుకు వెళ్ళండి. సమయం అధికంగా కేటాయించుట మేలు. కళారంగంలోని వారికి కొంత ఇబ్బందులు తప్పవు వేచిచూసే దోరణి మంచిది.


మీన రాశి

ఈవారం మొత్తంమీద స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిఅవుతాయి. ఆలోచనలు పెరుగుతాయి కొంత శ్రమను కలిగిఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెట్టుబడులు పెట్టుటకు ఇది తగిన సమయం కాదు నిదానం అసవరం. బంధువులకు సమయం ఇచ్చే అవకాశం కలదు వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు మిశ్రమఫలితాలు పొందుతారు ఇంకా కొంత సమయాన్ని చదువుకు కేటాయించుట మంచిది. ఉద్యోగులకు పెద్దగా అనుకూలంగా ఉండకపోవచ్చును శ్రమించాల్సి వస్తుంది. వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి దూరదృష్టి అవసరం అందరిని కలుపుకొని వెళ్ళండి.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
kukkeyadam... anabade over loading...