Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahitee vanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

నార్త్ కరోలినాలోని ఛార్లొట్టె అనే ఊరులోని బి.బి. అండ్ టి. అనే బేంక్ లోకి ఓ దొంగ చొరబడి తుపాకి చూపించి నగదు దోచుకున్నాడు. తర్వాత లంచ్ అవర్ లో ఆ బేంక్ ఉద్యోగస్థులు తాము రోజూ వెళ్ళే మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కి వెళ్తే, ఆ సమయంలో ఆ దొంగ కూడా లంచ్ కి అక్కడికే రావడంతో వాళ్ళు అతన్ని గుర్తుపట్టి పోలీసులకి ఫోన్ చేసి అతన్ని పట్టించారు.


 

మెరికాలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న వూళ్ళోని బేంక్ లోకి ఇద్దరు ముసుగు దొంగలు జొరబడ్డారు. తుపాకీలు చూపించి నాలుగు కేష్ కౌంటర్ లలో వున్న డబ్బుని దొంగిలించి బయటికి పారిపోయారు. అయితే పోలీసులు వచ్చి బేంక్ బయట కార్లో కూర్చుని దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు. వారి కార్లో పెట్రోల్ అయిపోయిన సంగతి వారు గ్రహించనే లేదు.
 

మరిన్ని శీర్షికలు
kaakoolu