Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

పల్లెటూరి రాంచరణ్‌

palletoori ram charan

పక్కా మాస్‌ మసాలా సినిమాల్ని ఇప్పటిదాకా చేసిన రామ్‌చరణ్‌, రూట్‌ మార్చాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ అంటున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా. ఈ లుక్‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మోడ్రన్‌ టచ్‌ ఇస్తూనే, పల్లెటూరి గెటప్‌లో కన్పించిన రామ్‌చరణ్‌ ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్‌ని బ్రేక్‌ చేస్తాడని అభిమానులు విశ్వసిస్తుండగా, సినిమా పరిశ్రమలో కూడా ‘గోవిందుడు అందరివాడేలే’పై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాలని కలలుగన్న కృష్ణవంశీకి ఆ కోరిక నెరవేరలేదు. అలా చిరంజీవిని, రామ్‌చరణ్‌లో కృష్ణవంశీ చూసుకుంటూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడని అనుకోవచ్చు.

ఫస్ట్‌ లుక్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ టీమ్‌ కూడా ఎంజాయ్‌ చేస్తోంది. పల్లెటూరి రామ్‌చరణ్‌ కాన్సెప్ట్‌కి అభిమానుల, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని సినిమా పరిశ్రమలోనూ చర్చ జరుగుతోంది. అంటే సినిమాకి పాజిటివ్‌ వేవ్స్‌ స్టార్ట్‌ అయినట్టే.

మరిన్ని సినిమా కబుర్లు
telugulo kaadu, hindilo