Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
palletoori ram charan

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగులో కాదు, హిందీలో

telugulo kaadu, hindilo

 హీరో వెంకటేష్‌ ఎప్పుడో చాలాకాలం క్రితం హిందీలో నటించాడు. తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘చంటి’ సినిమాని హిందీలో తీశారు. తెలుగులో నటించిన వెంకటేష్‌ హిందీలో కూడా నటించాడు. ఆ సినిమా అక్కడా మంచి విజయమే సాధించింది. మళ్ళీ చాలా గ్యాప్‌ తర్వాత వెంకటేష్‌ హిందీలో నటించే అవకాశం వుందంట.

విషయమేంటంటే, 1983లో కపిల్‌దేవ్‌ టీమ్‌ వరల్డ్‌కప్‌ సాధించిన నాటి సంగతుల్ని, ఆ విశేషాల్ని సినిమాగా రూపొందించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నం తెలుగులోనే ప్రారంభమైందని వార్తలొచ్చాయి. అయితే కొంచెం ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. అదేమిటంటే, సినిమా తెరకెక్కుతోన్నది హిందీలో అని.

తెలుగులో వెంకటేష్‌ నటిస్తున్నాడనే వార్త రాగా, దాన్ని హిందీ సినిమా టీమ్‌ కొట్టి పారేయలేదు. వెంకటేష్‌కి క్రికెట్‌ అంటే ఇంట్రెస్ట్‌. దాంతో హిందీ నిర్మాతలు వెంకటేష్‌ పేరును పరిశీలించొచ్చు. తెలుగులోకి రీమేక్‌ చేయాలనే ఆలోచన వారికి వస్తే, వెంకటేష్‌ కన్నా బెస్ట్‌ ఆప్షన్‌ ఇంకేముంటుంది? సినిమా అయితే తెలుగులో కాదు, హిందీలో అని స్పష్టత వచ్చింది. వెంకటేష్‌ మేటర్‌పై స్పష్టత రావాలి.

మరిన్ని సినిమా కబుర్లు
nakshatra yuddham