Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hindi serial actress hawa

ఈ సంచికలో >> సినిమా >>

వర్మ ఇలా అన్నారు కదా

varma ilaa annaaru kadaa

రామ్‌గోపాల్‌ వర్మ ఏ ప్రశ్నకీ సమాధానం సూటిగా చెప్పరు. తానేమనుకుంటాడో అలాగే సమాధానం చెప్తాడాయన. వంకర అనుకున్నా, ఇంకేమన్నా అనుకున్నా వర్మ ‘తర్కం’లో అర్థముంటుంది. ఆలోచింపజేస్తుంది. సినిమా సినిమా సినిమా.. ఇదే వర్మ లైఫ్‌ స్టయిల్‌. సినిమా తప్ప, ఇంక దేనిగురించీ ఆలోచించనని చెప్పే వర్మ, అప్పుడప్పుడూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్తుంటారు. వివాదాస్పద కామెంట్స్‌ కూడా చేస్తుంటారు.

‘నేను వివాదాల జోలికి వెళ్ళను, నేనేం మాట్లాడినా దాన్ని వివాదం చేస్తారు..’ అని చెప్పడమే వర్మకు చెల్లింది. రాజకీయాల విషయం గురించి వర్మ వద్ద ప్రస్తావన వచ్చిందోసారి. మీరే ముఖ్యమంత్రి అయితే.? అన్న ప్రశ్నకు వర్మ సమాధానం చాలా ఆసక్తిగా వుంది. సీఎం అయితే ఖజానా ఖాళీ చేసి సినిమాలు తీస్తా అని చెప్పారు వర్మ. ఆయన ఉద్దేశ్యం, రాజకీయాలపై వెకిలిగా మాట్లాడ్డం కాదుగానీ, సినిమా తప్ప తనకు దేనిమీదా ఆసక్తి లేదని ఆయన చెప్పాలనుకున్నారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

అయితే వర్మ ` హైద్రాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీకి వ్యతిరేకంగా నిలబడబోతున్నారనీ, శివసేన ` బీజేపీ సంయుక్తంగా వర్మని ఎన్నికల రంగంలోకి దించుతున్నారనీ జరుగుతున్న ప్రచారం మాటేమిటి? వర్మ గురించిన తెలిసనవారు ఇది కేవలం గాసిప్‌ అని కొట్టి పారేస్తున్నారు. రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చని నమ్మేవారు, వర్మ రాజకీయాల్లోకి వచ్చినా రావొచ్చంటున్నారు.

అయితే నిన్ననే వర్మ ట్విట్టర్ లో ఈ విషయాన్ని ఖండిచారు. తాను అసదుద్దీన్‌ ఒవైసీకి ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలబడటం లేదని స్పష్టం చేసారు.

మరిన్ని సినిమా కబుర్లు
rajamouli kannaa munde