Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope April 04 - April 10

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీదవాడి 'ఆపిల్' - పి. శ్రీనివాసు

Poor Mans Apple

జామ పండుని బీదవాడి ఆపిల్ అంటారు. నిజానికి ఆ సామెత మన భారతదేశానికి మాత్రమే వర్తిస్తుంది. మనకి జామకాయలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ! యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఈ రెంటికీ పెద్ద తేడా వుండదు. రెండూ ఒకే సైజులో, ఒకే ధరకి దొరుకుతాయి. సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో ఆపిల్ కంటే జామకాయ ఎక్కువ ఖరీదు. ఈ రెంటికీ ఆరోగ్య రీత్యా కొన్ని భేదాలున్నాయి. జామకాయలో పీచు పదార్థం ఉన్నందున అరుగుదలకు మంచిదనీ, ఆపిల్ రక్త ప్రసరణకి మంచిదనీ అంటారు. హార్ట్ కి సంబంధించిన జబ్బులున్న వాళ్ళని అందుకే 'ఆపిల్' తినమంటారు. "An Apple A Day, Keep Doctor Away" అని ఆంగ్లేయులంటారు.

ఈ రోజుల్లో మన దేశంలో రోజూ ఆపిల్ తినటం సాధారణ మానవుడికి కష్టమైపోయింది. కానీ మనకి అందుబాటులో వున్న జామపండుని గుర్తిద్దాము. నిజం చెప్పాలంటే ఆపిల్ కన్నా జామకాయ ఎంతో మంచిదని వైద్య శాస్త్రం చెబుతోంది.

జామకాయ లో కొవ్వు పదార్థం లేదు. ముఖ్యంగా ఇందులో A మరియు C విటమిన్లు వున్నాయి. జీర్ణ  శక్తిని పెంచుతుంది. కాన్సర్ నివారిణి. ఇంకా దీనిలో పొటాషియం వుంది. వీటితో పాటు 'శక్తి'నిస్తుందట. కాబట్టి ధరని బట్టి దేన్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు. మనదేశంలో జామకాయ అందుబాటులో వుండటం మన అదృష్టంగా భావించి కనీసం వారానికొక జామకాయనైనా భుజిద్దాం.

మరిన్ని శీర్షికలు
perlu-mudduperlu