Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
boyapatiki oopiradanivvaru

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్ నాట్యం చూసేయండి

akhil natyam chooseyandi

తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం అఖిల్ అక్కినేని తెరంగేట్రం. అందం, సౌకుమార్యం, హీరోతనం ఇలా అన్ని విషయాలతోనూ తను హీరో కాకముందే జనానికి పరిచయమయ్యాడు. పైగా "సిసింద్రీ" సినిమాలో చంటి పిల్లాడిగా కనిపించడంతో ఇతను పుట్టిన ఏడాదిలోపే సెలెబ్రిటీ అయిపోయాడు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, అక్కినేని కుటుంబ చిత్రం "మనం"లో అఖిల్ స్పెషల్ డ్యాన్స్ ఉంటుందట. అఖిల్ కూడా తమ కుటుంబ చిత్రంలో నటిస్తే బాగుంటుందని ఏయన్నార్ కూడా అనుకున్నారట. ఆయన కోరిక ప్రకారం అఖిల్ మీద ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అఖిల్ తెరంగేట్రం త్వరలో అవుతున్నట్టే! చూద్దాం. ఈ కొత్త వారసుడు ప్రేక్షకులను ఎలా రంజింపజేయనున్నాడో.

మరిన్ని సినిమా కబుర్లు
teluguloki pavan pustakam