Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil natyam chooseyandi

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగులోకి పవన్ పుస్తకం

teluguloki pavan pustakam

వన్ కళ్యాణ్ విడుదల చేసిన "ఇజం" పుస్తకం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. అయితే పుస్తకం చదివి కాదు. అది ఇంగ్లీషులో ఉండడం వల్ల. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, వివిధ పాత్రికేయులు, సామాన్య ప్రజానీకం ఈ పుస్తకాన్ని తెలుగులో చూడాలనుకుంటున్నారు. దీనికి తోడు రాం గోపాల్ వర్మ ఈ పుస్తకం పై ట్విట్టర్లో ఇచ్చిన స్పందన కొత్త వివాదానికి తెరలేపింది. ఈ పుస్తకాన్ని పవన్ అభిమతంగా రాసిన రాజు రవి తేజ కళ్యాణ్ ని పూర్తిగా వక్రమార్గం పట్టించారని, అసలు ఆ పుస్తకం ఆ రాసినతనికైనా అర్థమయ్యుంటుందా అని వ్యాఖ్యలు చేసారు. పనిలో పనిగా జనానికి అర్థం కాని కొన్ని పాశ్చాత్య సిధ్ధాంతాలని కూడా ట్విట్టర్లో ప్రస్తావించారు. ఏది ఏమైనా వర్మ ట్వీట్లు ఈ పుస్తకం ప్రచారానికి ఉపయోగపడ్డాయనుకోవాలి.

మరిన్ని సినిమా కబుర్లు
idi aadithe ghanatha daanide