Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
teluguloki pavan pustakam

ఈ సంచికలో >> సినిమా >>

ఇది ఆడితే ఘనత దానిదే

idi aadithe ghanatha daanide

రోజుల్లో సినిమా తీయడం పెళ్లి వీడియో తీయడమంత తేలికైపోయిందని పలువురి అభిప్రాయం. డిజిటల్ కెమెరాల పుణ్యమా అని కొందరు వారంలోను, 10 రోజుల్లోను కూడా సినిమాలు పూర్తి చేసేస్తున్నారు. కానీ ప్రచారం చేసి సినిమాని ప్రేక్షకులను చేర్చడంలో చాలామంది దర్శక నిర్మాతలు విఫలం అవుతున్నారు. కారణం ప్రచారానికి ఉపయోగపడే సరుకు లేకపోవడం. ఏ ముహుర్తాన ప్రచారం మొదలయ్యిందో కాని "హృదయ కాలేయం" ప్రచారం సోషల్ మీడియాలో హద్దు అదుపు లేకుండా సాగిపోయింది. దాదాపు కోటి ఖర్చు పెట్టినా రాని ప్రచారం ఉచితంగా సోషల్ మీడియాలో వచ్చేసింది. అందుకు వెరైటీ కంటెంట్ ఉన్న సినిమాని, ట్రైలర్స్ ని అందించడంలో దర్శకుడు స్టీవెన్ శంకర్ ని అభినందించాలి. ఇక ఈ సినిమా నేడు విడుదలయ్యింది. ఆడితే ఆ ఘనత సోషల్ మీడియాకి ఇవ్వాల్సిందే. సినిమా విజయానికి సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతుందో ఈ దెబ్బకు తెలిసిపోతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
ladies and gentlemen first look