Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ladies and gentlemen first look

ఈ సంచికలో >> సినిమా >>

శాటిలైట్ తేరగా రాదు

syatilait teraga radu

సినిమా తీద్దామన్న సరదా వున్న ప్రతివాడు గతంలో శాటిలైట్ హక్కులను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగిపోయేవాడు. తాను పెట్టిన కోటిన్నర పెట్టుబడి శ్యాటిలైట్ చానల్ వాళ్లు హక్కులు కొనుక్కుని ఇచ్చేస్తే ఆపైన జనం చూస్తే లాభం వచ్చినట్టు, చూడకపోతే నష్టం లేనట్టు లెక్కేసుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు దృశ్యం అలా లేదు. గతంలోలాగ శాటిలైట్ చానల్స్ సినిమాలను పెద్ద మొత్తాలకు కొనడం లేదు. చానళ్ల మధ్య ఈ విషయంలో స్పర్థ లోపించడం కూడా అందుకు కారణం. రెండేళ్ల క్రితం ఒక మోస్తరు సినిమాకి కోటి ఇచ్చే చానళ్లు ఇప్పుడు నలభై ఇస్తానంటున్నాయి. అలాగని నలభై లక్షల్లో సినిమాని చుట్టేయడం కష్టం. ఒకవేళ చుట్టేస్తే దాని వాలకం చూసి ఐదు లక్షలిస్తామంటాయి చానళ్లు. కనుక విషయం ఉన్న సినిమా ధైర్యంగా తీసి మార్కేట్లో నిలబడే ఆలోచన ఉంటే రంగంలోకి దిగాలి తప్ప, శాటిలైట్ వాళ్లు లైట్ వెలిగిస్తారులే అనుకుంటే అంతే సంగతులు. అలా తప్పుడు లెక్కేసి తీసిన సినిమాలు ఇటు శాటిలైట్ వ్యాపారం అవ్వక, అటు విడుదల అవ్వక పురిట్లోనే హరీమంటున్నాయి!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam