Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Boyapati Srinu

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - రౌడీ

movie review Rowdy

చిత్రం: రౌడీ
తారాగణం: మోహన్ బాబు, జయసుధ, విష్ణు, శాన్వి, తనికెళ్ల భరణి, కిషోర్, పరుచూరి, రవిబాబు తదితరులు
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: కాసర్ల శ్యాం
కెమెరా: సతీష్ ముత్యాల
దర్శకత్వం: రాం గోపాల్ వర్మ
విడుదల తేదీ: 4/4/14

క్లుప్తంగా చెప్పాలంటే:
జనానికి మంచి చేసి "రెస్పెక్ట్" సంపాదించాలనుకునే క్యారెక్టర్ అన్న (మోహన్ బాబు) ది. తన చిన్నకొడుకు (విష్ణు) చదువు పూర్తి చేసుకుని తండ్రిని చేరతాడు. ఊళ్లో అక్రమంగా కడుతున్న ఒక కట్టడాన్ని అడ్డుకుంటాడు అన్న. దాంతో ప్రత్యర్థులతో గొడవ మొదలొతుంది. ఇదిలా ఉండగా అన్నకి తన పెద్ద కొడుకు (కిషోర్) తో మనస్పర్ధలు వస్తాయి. ఈ నేపధ్యంలో ఆ రాయలసీమ గ్రామంలో కథ ఎలా సాగిందనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
గతంలో హిందీలో వచ్చిన సర్కార్ 1, 2 భాగాల్లోని ఛాయలు ఈ సినిమాలో ఉన్నయని అనుకున్నా ఆ సినిమాలు చూడని బి,సి సెంటర్ ప్రేక్షకులని ఇది అబ్బురపరుస్తుంది. రాం గోపాల్ వర్మ కు ఇటువంటి సినిమాలు తీయడం సహజ లక్షణం. కక్షలు, కార్పణ్యాలు, ఆత్మాభిమానాలు, వ్యక్తిగత స్వార్థాలు అన్నీ కలగలిపి ఈ రౌడీ ని తీసారు. అయితే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ గొప్ప అంశం మోహన్ బాబు పాత్ర చిత్రణం. ఆయనకు నూటికి నూరు మార్కులు. అలాగే విష్ణుకి కూడా తన కెరీర్ లో చెప్పుకోదగ్గ మంచి పాత్ర. ఆవేశపూరితమైన పాత్రలో కిషోర్, సహజమైన పాత్రలో సహజనటి జయసుధ, సీరియస్ పాత్రలో పరుచూరి, విభిన్న తరహాలో తనికెళ్ల తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

సంగీత పరంగా సాయి కార్తిక్ దర్శకునికి కావల్సిన విధంగా పనిచేసి ప్రేక్షకులను కూడా రంజింపచేసారు. కాసర్ల శ్యాం పాటల్లోని సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా "అమ్మోరిని మించిన అయ్యవు...", "నీ మీద ఒట్టు" పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. వర్మ ఈ మధ్య తీసిన కొన్ని సినిమాల్లోలా కాకుండా ఈ సారి అన్ని విభాగాలకు, కథకు కూడా "రెస్పెక్ట్" ఇచ్చి తీసిన సినిమా ఇది. ఫలితం కూడా ఆయన మర్యాదను పెంచేదిగానే ఉంటుంది. కథానాయిక శాన్వి తన అందచందాలతో, సందర్భోచితమైన నటనతో బాగానే కట్టిపరేసింది.

ఒక్క మాటలో చెప్పాలంటే: చూడండి

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
movie review Hrudaya Kaleyam