Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review Rowdy

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - హృదయ కాలేయం

movie review Hrudaya Kaleyam

చిత్రం: హృదయ కాలేయం
తారాగణం: సంపూర్ణేష్ బాబు, సమత, కావ్య, సునీల్ వేదంగి, కత్తి మహేష్.
సంగీతం: ఆర్.కె, శ్రీకాంత్ పెండ్యాల
నిర్మాత: సాయి రాజేష్ నీలం
దర్శకత్వం: స్టీవెన్ శంకర్
విడుదల తేదీ: 4/4/14


క్లుప్తంగా చెప్పాలంటే:
పెద్ద పెద్ద దోపిడీల వెనక ఉన్న ఒక పెద్ద దొంగ ఎవరో తెలియక, పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తం సతమతమవుతోంది. మొత్తానికి ఆ పెద్ద దొంగ పేరు సంపూర్ణేష్ బాబు అని తెలుస్తుంది. అతడిని పట్టుకోవడానికి పోలీసు అధికారులు ఒక స్పెషల్ టీమ్ ని కూడా రంగంలోకి దించుతారు. అయితే ఆ పోలీస్ అధికారుల్లో ఒకరికి సంపూర్ణేష్ బాబు గతం తెలుసు. అతని ప్రేమకథ, అప్పుడు తెరమీద కొస్తుంది. తన ప్రేమ ఏమయింది, తరువాత ఆ దొంగతనాలకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది మొదలైనవన్నీ తెరమీదచూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
కేవలం సోషల్ మీడియా సౌజన్యంతో కోట్లు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ ఈ సినిమా కొచ్చింది. చిత్రమైన టైటిలు, విచిత్రమైన పోస్టర్, చిత్ర విచిత్రమైన హీరో, విభిన్నమైన ట్రైలర్... ఇలా అన్నీ కలిసి ప్రచారాన్ని పదింతలు చేసాయి. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఈ రోజు థియేటర్లు నిండిపోయాయి. ముందునుంచీ, ఇది వెకిలి కామెడీ చిత్రంగా, అందరికీ పరిచయం అయిపోయింది కనుక, ఆ వెకిలితనాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళకి ఫుల్ మీల్స్ దొరికినట్టే.

అసలు ఈ సినిమా ప్రచారం గురించి గానీ, బొత్తిగా సోషల్ మీడియాతోగానీ, పరిచయం లేనివాళ్ళకు మాత్రం ఇది మింగుడుపడదు. మొత్తానికి సంపూర్ణేష్ బాబు కామెడీ ఈ సినిమాకి హైలెట్. అతను పెద్ద పెద్ద డైలాగ్ లు, తన పెద్ద నోరుని పెద్దగా తెరచి చెబుతూంటే, థియేటర్లలో ఈలలు పడ్డాయి. ఈ సినిమాని కొత్తతరహాలో ముందుకు తీసుకువచ్చినందుకు దర్శకున్ని ప్రశంశించాలి.

మొత్తంగా చెప్పేదేంటంటే ఈ సినిమా ఏమి ఉద్దేశించి తీసారో, ఆ ఉద్దేశం నెరవేరినట్టే అనుకోవాలి. తొలి మూడురోజులు సరిగ్గా ఆడినా, ఈ చిత్ర నిర్మాతలు భారీ లాభాల బాటలో పడతారు. ఎందుకంటే ఇది అంత లోబడ్జెట్ లో తీసిన సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే: వెరైటీ కామెడీ! నవ్వులే నవ్వులు!!

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu