Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

ఇక "కొబ్బరిమట్ట"

kobbarimatta
"హృదయ కాలేయం" అనే విచిత్రమైన టైటిల్ పెట్టి సంపూర్ణేష్ బాబు అనే ఏ మాత్రం గ్లామర్ లేనతన్ని హీరోగా పెట్టి స్టీవెన్ శంకర్ తీసిన చిత్రం వసూళ్ల పంట పండిస్తోంది.

ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో వచ్చిన అతిని అతిశయోక్తితో కలిపి కొత్త తరహా నవ్వులు పూయించిన ఈ చిత్రానికి యువతనుంచి మరీ ముఖ్యంగా ఇంటెర్నెట్ యువతనుంచి ఆదరణ బాగుంది.

ఇప్పుడు అదే టీం మళ్లీ మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. దాని టైటిల్ "కొబ్బరిమట్ట". ఇందులో విశేషమేమిటంటే సంపూర్ణేష్ త్రిపాత్రాభినయం. పల్లెటూరు నేపధ్యంలో సాగే ఈ సినిమా "హృదయకాలేయం" కంటే ఎక్కువ నవ్వులు మొలిపిస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. 
చూద్దాం "కొబ్బరిమట్ట" నిర్మాతాలకు ఏ మేరకు డబ్బుల కట్ట తెచ్చిపెడుతుందో! 
 
మరిన్ని సినిమా కబుర్లు
boyfriends paraar