Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kobbarimatta

ఈ సంచికలో >> సినిమా >>

ఆమె బాయ్ ఫ్రెండ్స్ పరార్!

boyfriends paraar
రాం గోపాల్ వర్మ తాజాగా తన కొత్త హారర్ సినిమా "పట్టపగలు" ట్రైలర్ విడుదల చేసారు. స్వాతి దీక్షిత్ ఇందులో హీరోయిన్. అందంగా కనపడతూ కుర్రకారు మనసును దోచునేలా కనపడే స్వాతి దీక్షిత్ ఇందులో దెయ్యం పట్టిన పాత్ర పోషించింది. నటనలో తన విశ్వరూపం చూపించింది. ట్రైలర్ లోనే భయం గొలిపేలా ఉన్న ఈమెను చూసి అప్పటిదాకా మనసుపారేసుకున్న వారు కూడా మనసు మార్చుకోవాల్సిందే! కొందరైతే 'స్వాతికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్లు కాస్తా ఈ సినిమా చూసాక పారిపోతారేమో" అని అనుకుంటున్నారట. 
స్వాతి అద్భుతంగా నటించిందని, తను అనుకున్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవుట్ పుట్ ఇచ్చిందని వర్మగారు చెబుతున్నారట.

"ఫూంక్", "భూత్ 2" చిత్రాల్లో చిన్న పిల్లలకు దెయ్యం పట్టించి భయపెట్టిన వర్మ ఈ సారి యౌవనంలో ఉన్న అమ్మాయికి దెయ్యం పట్టిస్తున్నారు.

ఏది ఏమైనా హారర్ తీయడమంటే ఎంతో సరదా ఉన్న వర్మ ఈ "పట్టపగలు" తో విజయం వెలుగు చూడాలని ఆశిద్దాం. 
మరిన్ని సినిమా కబుర్లు
akkineni choodani cinema