Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akkineni choodani cinema

ఈ సంచికలో >> సినిమా >>

"కొత్త జంట" మీద మాస్ ఆశలు

kotta janta meeda mass aashalu
అల్లు శిరీష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న "కొత్త జంట" సినిమా మాస్ ప్రేక్షకుల్లో ఆశలు నింపుతోంది. పాత సినిమాల్లోని హిట్ పాటలను రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇందులో కూడా ఒక సూపర్ హిట్ చిరంజీవి సినిమాలోని పాటను "కొత్త జంటలో" చేర్చారు.
 
'అటు పెద్దాపురం ఇటు అమలాపురం మధ్య గోదావరి...' అంటూ సాగే "ఖైదీ నెంబర్ 786" లోని పాటను రీమిక్స్ చేసి మధురిమ మీద చిత్రీకరించారు. ప్రస్తుతానికదే ప్రధాన ఆకర్షణగా ఉంది ఈ సినిమా ప్రచారానికి.
 
యువతను ఆకట్టుకునే సంభాషణలతో సూపర్ హిట్స్ కొట్టే మారుతి ఈ సారి శిరీష్ కి హిట్టివ్వబోతున్నాడని సమాచారం. ఈ చిత్రం ట్రైలర్ గతవారం విడుదలయ్యింది. ఆసక్తి రేకెత్తించేలా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. 
 
మరిన్ని సినిమా కబుర్లు
rajamouli - shastri chittashuddhi