Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

అమృతం తాగాలనుందా?

amrutam taagaalanundaa?
టీవీ సీరియల్ "అమృతం" అందరికీ సుపరిచితమే. లెక్కకు మించిన ప్రయివేట్ చానళ్లు వచ్చిన తర్వాత కూడా ఆ ధాటికి తట్టుకిని నిలబడిన హాస్య ధారవాహికం "అమృతం". అలనాటి "అనందోబ్రహ్మ" సిరీస్ తర్వాత ఆ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకున్న సీరియల్ ఇది. దీని రూపశిల్పి ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు.

ఇప్పుడు అదే టైటిల్ స్ఫురించేలా "చందమామలో అమృతం" పేరుతో ఒక చిత్రాన్ని రూపొందించారాయన. అయితే "అమృతం" అన్న పదాన్ని ప్రధానంగా చూపలన్న ఉద్దేశ్యంతో "అమృతం...చందమామలో" అని మార్చారట. అంటే "అమృతం" అన్న దాన్ని మెయిన్ టైటిల్ గా పెట్టి "చందమామలో" అనే దాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టారన్నమాట. ఆలోచన బాగానే ఉంది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరిక మాత్రం ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఈ వేసవి సెలవుల్లో ఇటు పిల్లలకి, అటు పెద్దలకి కూడా చక్కని నవ్వుల విందు అందించడానికి ముందుకొస్తోంది. అమృతం తాగడానికి సిద్ధం అవ్వండి మరి.
మరిన్ని సినిమా కబుర్లు
nandamoori heroki manchi rojulu