Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
amrutam taagaalanundaa?

ఈ సంచికలో >> సినిమా >>

నందమూరి హీరోకి మంచిరోజులు

nandamoori heroki manchi rojulu

నందమూరి కళ్యాణ్ రాం. అటు నటనలోను, ఇటు సినిమాల మీద ఆసక్తి లోనూ ఎవరికీ తీసిపోరు. అయితే ఈ తరంలో జయాపజయాలు ప్రేక్షకదైవాధీనాలు. ఈ మధ్య ఆయన విజయాలకు కాస్త దూరంగా ఉన్నా, ఇప్పుడు మంచిరోజులొచ్చాయంటున్నారు విశ్లేషకులు.

తాజాగా "రేసుగుర్రం" లాంటి సూపర్ హిట్టు ఇచ్చిన సురేందర్ రెడ్డితో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు కళ్యాణ్ రాం. ఇందులో హీరో రవితేజ. టైటిల్ "కిక్ 2". గతంలో వచ్చిన "కిక్" ఎంత హిట్టో అందరికీ తెలుసు. ఇంకా తాజా చిత్రం "రేసుగుర్రం" నీడ కూడ ఈ సినిమాపై పడుతుంది.

దాంతో నిర్మాణానికి ముందే అంచనాలు పెరిగి మంచి వ్యాపారం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు. అదే నిజమై కళ్యాణ్ రాం కి మంచి రోజులు రావాలని ఆశిద్దాం. అలాగే "కిక్ 2" ప్రేక్షకులని తనివితీరా నవ్వించి, మురిపించి, మైమరిపించి అలరించాలని కూడా కోరుకుందాం.

 

మరిన్ని సినిమా కబుర్లు
tiruguleni resu gurram