Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ladies & jentilmen new poster

ఈ సంచికలో >> సినిమా >>

అందాల వెలుగులు

andaala velugulu

అందం, అభినయంతో పాటు అదృష్టం, దైవబలం తోడుంటే తప్ప సినిమా రంగంలో నటీమణులకి నాలుగు మంచి అవకాశాలు రావు. "లవ్లీ" అనే చిత్రంతో పరిచయం అయిన నటి శాన్వి, వెనువెంటనే రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో "రౌడీ" లో నటించింది. వర్మ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నాక ఇప్పుడు "ప్యార్ మె పడిపోయానే" అనే సినిమాతో ముందుకొస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఆమె స్టిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అవి చూసిన వాళ్లు ఈమెకు మరింత మెరుగైన భవిష్యత్తు ఉందంటున్నారు.

చేసిన సినిమాలు రెండు మూడైనా జనం దృష్టిలో, మీడియా కళ్లల్లో పడేలా ఉంటే అదే నాలుగు మంచి అవకాశాలు మోసుకొస్తుంది. శాన్వి విషయంలో అదే జరిగింది.

ఆమె వెలుగు మెరుపులాగ అలా మెరిసి ఇలా మాయం అవకుండా కలకాలం వెలుగుతూ ఉండాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
shwetha basu prasad item song