Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shwetha basu prasad item song

ఈ సంచికలో >> సినిమా >>

అమెరికా ప్రయత్నాల్లో తారలు

america prayatnallo taaralu

మే వస్తోంది. ఈ సీజన్లో పలువురు కళాకారులు, సినీ తారలు, సాంకేతిక నిపుణులు అమెరికా ప్రయాణాల హడావిడిలో ఉంటూ ఉంటారు. కారణం జూలై మొదటి వారంలో ప్రతి ఏడు ఏదో ఒక ప్రముఖ ప్రవాసాంధ్ర సంస్థ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ కోటాలో అమెరికా వేదికపై తమ ప్రతిభను చాటడమే కాకుండా అక్కడ సంస్థ ఖర్చులతో పర్యటించే అవకాశం కూడా ఉండడంతో కళాకారులకు అమెరికా ఆశలు పుడుతుంటాయి.

ఏ సాఫ్ట్ వేర్ చదివిన వారికో అయితే అమెరికాలో ఉద్యోగావకాశలు ఉంటాయి కాని, కళాకారులకు అక్కడి తెలుగువారు తప్ప వేరే అవకాశం ఉండదు.

ప్రస్తుతానికి పలువురు సినీజనం, కళాబృందాలు జూలైలో అట్లాంటాలో జరగబోయే నాటా వేడుకలకు హాజరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam