Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - neeti rangula chitram

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఏప్రిల్ 18 - ఏప్రిల్ 24) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత పనుల విషయంలో నిదానంగా వ్యవహరించి పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట ద్వారా విజయంను పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా అశ్రద్దచేయక పోవడం మంచిది. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సరైన అవగాహన కలిగి లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగులకు పనిఒత్తిడి ఉంటుంది అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనుల మూలాన ఒత్తిడిని కలిగి ఉంటారు. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మేలుజరుగుతుంది.


వృషభ రాశి

ఈవారం మొత్తంమీద కొంత ప్రతికూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులకు దూరంగా ఉండుట మంచిది. నూతన ప్రయత్నాలలో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలలో తొందరపాటు పడకూడదు. విద్యార్థులకు ఆలోచనలు పెరుగుతాయి స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును మానసికఒత్తిడిని కలిగి ఉంటారు. ఉద్యోగులకు అధికారులతో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది గతంలో చేసిన ఆలోచనలు పూర్తిచేసే ప్రయత్నం చేయండి. కళారంగంలోని వారికి ప్రయత్నాలు చేయుట వలన నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం కలుగుతుంది.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. అనుకోని ప్రయాణాలు చేయుట మూలాన ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది వారిఆలొచనలను వ్యతిరేకిస్తారు. ఉద్యోగులకు ఉద్యోగంలో ఒత్తిడిని కలిగి ఉంటారు తోటివారితో మీకు గల సంబందాలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆటంకాలు కలిగినను చివరకు పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి కొంత నిరాశ తప్పదు, అవకశాలు వచ్చినట్లే వచ్చి చేజారి పోయే అవకాశం ఉంది కావున సన్నద్ధం కండి. 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోవాలని సమయాన్ని మీకు అనుకూలంగా గడపాలనే కోరికలను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి నిదానం అసవరం. ప్రయాణాల మూలాన సమయం వృధాఅయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమతప్పక పోవచ్చును. ప్రణాలిక లేకపోతే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగులకు అధికారులతో చర్చలు చేపడుతారు సర్దుబాటు అవసరం. ఉద్యోగరిత్యా నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. వ్యాపారస్థులకు ఖర్చులుపెరుగుతాయి సమయానికి ధనం చేతికి అందకపోవడం చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు.  కళారంగంలోని వారికి పెద్దలతో పరిచయాలు అవుటకు అవకాశం ఉంది అలాగే విందులలో పాల్గొంటారు. సమయాన్ని బిజీగా గడుపుటకు ఆస్కారం కలదు.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద మిత్రులను కలుస్తారు వారితో సమయం గడుపుతారు. ప్రయాణాలు అంతంగా ఉపయోగపడక పోవచ్చును వీలైతే వాయిదా వేయుట మంచిది. ప్రయత్నాలు మొదలు పెట్టునపుడు మీబలాన్ని అంచనా వేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. నూతన మిత్రులతో కలిసి ప్రయత్నాలు ఆరంభించక పోవడం ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో మీదైన ముద్రను వేయాలనే చేసే ప్రయత్నం ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది కొంత శ్రమకు ప్రణాళిక తోడైతే విజయంను పొందుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు బాగుంటుంది నిదానంగా చేసిన పనులకు గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది చేపట్టిన పనులలో ఆశించిన లాభాలు పొందుతారు. కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది వాటిని ఉపయోగించుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయాన్ని ఇస్తారు నచ్చిన వారినుండి కొత్త వార్తలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం కలదు . ప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం కలదు. బంధువులతో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. దూరప్రదేశం నుండి నూతన వార్తలు తెలుసుకొనే ఆస్కారం కలదు. విద్యార్థులకు వచ్చిన అవకశాలు ఉపయోగించుకొనే నేర్పు ఉండుట వలన మేలుజరుగుతుంది. ప్రయత్నం పెంచుట మంచిది. ఉద్యోగులకు నూతన ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళుట చేత మానసికంగా దైర్యం వస్తుంది. వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట చేత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికికొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి వాటిని అమలుచేయుటకు అనువైన సమయం కోసం వేచిచూసే ప్రయత్నం చేయుట శ్రేయస్కరం.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత నిరాశను పొందినను చివరకు దానిని అధిగమిస్తారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం అనేది సూచన. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తారు లేదా వాటిమూలాన భాధకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు రావడం వలన చాలావరకు మానసికప్రశాంతతను కలిగి ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలాకష్టంగా భవిష్యత్తుభారంగా కనభడుతుంది. పెద్దల సూచనలు పాటించకపోతే ఇబ్బందులు ఎక్కవ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుతారు కొంత అధికారుల నుండి అనుకోని వ్యతిరేకత వచ్చినను దానిమూలాన ఇబ్బంది ఉండదు, సమయం పనిఒత్తిడి మూలాన గడిచి పోతుంది. వ్యాపారస్థులకు అబివృద్ది ఉంటుంది అదిపెద్దమొత్తంలో కాకపోవచ్చును. కళారంగంలోని వారికి శ్రమకు తగ్గఫలితం ఉంటుంది. 

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద గతంలోని ఆలోచనలను అమలు చేయాలనే ఆలోచన కలిగిఉంటారు. నూతన ప్రయత్నాలు ఆరంభించడానికి అమితమైన ఉత్సాహంను చూపిస్తారు. ప్రయాణాలు కొంత కలిసి వచ్చినప్పటికిని శ్రమతప్పదు. ఆరోగ్యపరమైన విషయాల్లో మొండిగా వెళ్ళకండి తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంబసభ్యుల ఆలోచనలను కొట్టిపారేయకండి వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి ఆలోచించుట ఉత్తమం. మానసికంగా గతంకన్నా దైర్యంగా ఉంటారు. విద్యార్థులకు నిర్ణయాలు తీసుకోవడం విషయంలో సందిగ్దత ఉంటుంది పెద్ద పెద్ద నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు కొంత ఆగడం మంచిది. ఉద్యోగులకు చిన్న చిన్న విభేదాలు తోటివారితో కలుగుటకు ఆస్కారం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారస్థులకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి కాకపోతే సాధ్యసాద్యాలు ఆలోచించుట మంచిది. కళారంగంలోని వారికి కుటుంబపరంగా మార్పులు సంభవించే అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద విందులలో పాల్గొంటారు మిత్రులతో సమయాన్ని సరదగా గడుపుతారు, భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆరంభంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు మనస్సును స్థిమితంగా ఉంచుకొని ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేక వర్గం నుండి పోటీని ఎదుర్కొంటారు నిదానంగా వ్యవహరించి తెలివితో సమస్యను దాటండి. విద్యార్థులకు బాగుంటుంది ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం ఉంది కావున పోటీపరిక్షలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉన్న చివరకు వాటిని పూర్తిచేస్తారు అధికారులతో మంచిసంబంధాలు అవసరం. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పనులు నెరవేరుతాయి. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి పెట్టుబడలు పెట్టకపోవడమే మంచిది. కళారంగంలోని వారికి లేనిపోని విషయాల్లో తలదూర్చకండి ముఖ్యంగా స్త్రీ సంబంధమైన విషయాల్లో నిదానం అవసరం. 


మకర రాశి

ఈవారం మొత్తంమీద ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండి వాటితో ముందుకు వెళ్ళుట అనేది సూచన తప్పక అనుకున్న ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు. కుటుంబంలో గతంలో తీసుకున్న నిర్ణయాల వలన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న వివాదములు కలుగుటకు అవకాశం ఉంది వాటికి దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. విద్యార్థులకు బాగుంటుంది పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. దూరదృష్టి తప్పక మేలుచేస్తుంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. పనిభారం మాత్రం తప్పక పోవచ్చును. వ్యాపారస్థులు నూతన ఆలోచనలు చేస్తారు కుటుంబసభ్యుల సహాకారంతో పనులు నెరవేరుతాయి. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన అవకశాలు వచ్చుటకు ఆస్కారం కలదు.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబంలో మార్పులు జరుగుతాయి వాటిని గమనిస్తూ ఉండుట మంచిది. తలపెట్టిన పనులపైన అవగాహన అవసరం అలాగే ప్రణాలికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది వారితో సమయాన్ని సరదగా గడుపుతారు. అనుకూలమైన ఫలితాలు పొందుటకు శ్రమతో పాటు తోటివారి సహాకారం అవసరం. విద్యార్థులకు ఆలోచనలు పెరుగుటకు ఆస్కారం ఉంది వాటిని తగ్గించుకోండి లక్ష్యం పైన దృష్టిని పెట్టుట మంచిది. ఉద్యోగులకు కొత్త కొత్త భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది, ఆశించిన గుర్తింపును నలుగురిలో పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు దూరప్రదేశాలకు వెళ్ళవలసి రావోచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి పెద్దల నుండి సహాయసహకారాలు లభిస్తాయి కాకపోతే తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళుప్రయత్నం మంచిది.


మీన రాశి

ఈవారం మొత్తంమీద రాజకీయపరమైన విషయాల్లో మీ ఆలోచనలు అనుకున్న ఫలితాలు ఇచ్చుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన సంఘంలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుట వలన కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చును. విద్యార్థులకు మిశ్రమఫలితాలు వస్తాయి సమయాన్ని వృధాచేయకుండా సమయపాలన పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది అధికారులతో చేసిన పనుల వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాటతీరు ప్రభావితం చేస్తుంది కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. కళారంగంలోని వారికి చిన్న చిన్న ప్రయాణాలు తప్పకపోవచ్చును వాటిని ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
kopam vaste... evadiki uddarimputa?