Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddaam

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - లడ్డు బాబు

movie review Laddu Babu

చిత్రం: లడ్డు బాబు
తారాగణం: అల్లరి నరేష్, పూర్ణ, భూమిక, కోట శ్రీనివాస రావు తదితరులు
సంగీతం: చక్రి
దర్శకత్వం: అల్లరి రవిబాబు
నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని
విడుదల తేదీ: 18 ఏప్రిల్ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
లడ్డుబాబు ఎందుకంత లడ్డూలా తయారయ్యాడు అనే కథతో కథనం మొదలౌతుంది. 200 కిలోలు తూగే లడ్డు బాబు తన మనసుకు దగ్గరగా ఉండే జీవిత భాగస్వామి కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో పూర్ణ అతని కళ్లల్లో పడుతుంది. కానీ ఇంతలో మరో అమ్మాయి లడ్డు బాబంటే ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కథ ఎటు తిరిగి ఏమౌతుంది అనేది ఈ సినిమా ఇతివృత్తం.

మొత్తంగా చెప్పాలంటే:
అల్లరి నరేష్ చిత్రాల్లో మరిచిపోలేనిదిగా నిలిచిపోయే చిత్రమిది. అందుకు కారణం అతని ఆహార్యం. సన్నగా లైటు స్థంభంలా ఉండే నరేష్ ను అలా 200 కిలోల మనిషిలా తీర్చిదిద్దిన మేకప్ విభాగం వారికి పూర్తి ప్రశంశలు దక్కుతాయి. ఎక్కడా కృత్రిమత్వం లేకుండా అద్భుతం అనిపించేలా మార్చేసారు అతన్ని. పూర్ణ అందచందాలు, భూమిక లావణ్యం తో పాటు రవిబాబు దర్శకత్వ పనితీరు కూడా వంక పెట్టలేనిది.

అయితే ఈ సినిమా చూడడానికి వచ్చేవారు హాస్యాన్ని ఎక్కువగా ఆశించి వస్తారు. అందుకు కారణం ఇది ప్రధానంగా అల్లరి నరేష్ చిత్రం కావడం. కాని ఊహించిన దానికి భిన్నంగా ఇందులో హాస్యం పాళ్లు ఎక్కువలేవు. కథ ఇంటర్వల్ వరకు పెద్దగా సాగదు. పైగా కాస్త మెలోడ్రామా ఛాయలు కూడా ఉన్నాయిందులో.

పేరొందిన కమెడియన్స్ ఉన్నా అంతా అతిధి పాత్రలకు పరిమితమయ్యారు. అంతకు మించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే: అల్లరి నరేష్ మేకప్ చూడడానికైతే ఓకె.

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు