Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
andaala velugulu

ఈ సంచికలో >> సినిమా >>

"శ్వేతా బసు ప్రసాద్ ఐటమ్ సాంగ్"

shwetha basu prasad item song

స్పైసీ క్రియేషన్స్ మరియు శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ఇంటిలిజంట్ ఇడియట్స్" చిత్రంలోని "ముందుకు చూడు... వెనకకు చూడు..." అనే ఒక స్పెషల్ సాంగ్ లో శ్వేతా బసు ప్రసాద్ నటించారు. ఈ పాటకు కె.సి మౌళి స్వరాలు సమకూర్చగా, సాహిత్యాన్ని శ్రీహరి మంగళంపల్లి అందించారు.

భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట కుర్రకారును ఊపేస్తుందని శ్వేతా బసు ప్రసాద్ తెలియజేశారు. నిర్మాతలలో ఒకరైన శ్రీహరి మాట్లాడుతూ చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, మే చివరి వారంలో సినిమా రిలీజ్ కు ఫ్లాన్ చేస్తున్నామని చెప్పారు.

దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమాని తీర్చి దిద్దామని, సప్తగిరి, షకలక శంకర్ మరియు పోసాని కృష్ణ మురళి గార్ల కామెడీ హైలెట్ గా నిలుస్తుందని తెలిపారు.

మరిన్ని సినిమా కబుర్లు
america prayatnallo taaralu