Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
excess baggage

ఈ సంచికలో >> శీర్షికలు >>

2014 పోటీలకు రంగం సిద్దం - -

Telugu Maatlaata 2014

అమెరికాలోని పిల్లలలో తెలుగు భాషపై ఉన్నపట్టుని ఇంకో మెట్టుపైకి తీసుకెళ్ళడానికి, వారికి ఉత్తేజం కలిగించే రీతిలో, సిలికానాంధ్ర మనబడి అమెరికాలో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న “తెలుగు మాట్లాట 2014 - పలుకే బంగారం, పదమే సింగారం” భాషా వికాస ఆటలపోటి మే మరియు జూన్ నెలలలో బే ఏరియా, దక్షిణ కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, అట్లాంటా, వర్జీనియా, కేరి, ఫిలడల్ఫియా, న్యూ జెర్సీ, మిచిగన్, న్యు యార్క్, కనెక్టికట్, మస్సాచుసెట్స్, చికాగో, మరియు ఒరెగాన్లలో జరగబోతున్నాయి. ఈ వినూత్నమైన తెలుగుమాట్లాట పోటీలలో మీ పిల్లల పేర్లు వెంటనే నమోదు చేసుకొనవచ్చు.

2013లో ప్రారంభించబడి, పిల్లలకి ఇష్టమైన ప్రపంచమంతా ప్రసిధ్ధి గాంచిన ఆటల్ని తీసుకొని, వాటిని ఆంధ్రీకరించి “పదరంగం (తెలుగులో స్పెల్లింగ్ బీ)”, తిరకాటం (తెలుగులో జిపర్డీ) ఇంకా “ఒక్క నిమిషం మాత్రమే” (తెలుగులో జామ్) పోటీలుగా నిర్వహించబడిన తెలుగు మాట్లాట ఆటలు అమెరికాలోని తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటి సంవత్సరంలోనే ప్రాంతీయ పోటీలలో 700 మంది ఆరు నుండి పదహారు వయస్సులోని బాలబాలికలు అమెరికాలోని 14 ప్రధాన పట్టణాలనుంచి పాల్గొన్నారు. వారిలో 40 మంది పిల్లలు జాతీయ పోటీలలో పాల్గొని "భాష సేవయే భావితరాల సేవ" అను సిలికానాంధ్ర మనబడి మంగళవాక్యం అభేద్యమని నిరూపించారు.

2014లో తెలుగు మాట్లాట కార్యక్రమాన్ని మరి కొంత అభివృద్ధి చేసాము. మొదటగా వయోపరిమితులలో కొత్తగా బుడతలు అన్న వర్గాన్ని చేర్చబడినది. దాని పరిణామంగా 5-9 వయస్సుగలిగిన పిల్లలు బుడతలుగా, 10-13 వయస్సుగల పిల్లలు సిసింద్రిలుగా, 14-16 వయస్సుగల పిల్లలు చిరుతలుగా పోటికి తలపడతారు”, అని తెలుగు మాట్లాట నిర్దేశకుడు డాంజి తోటపల్లి చెప్పారు. ప్రాంతీయ పోటీలలో పాల్గొని, అక్కడ గెలుపొందిన పిల్లలు సెప్టెంబర్ 2014 లేబర్ డే వారాంతరంలో కాలిఫోర్నియాలో జాతీయస్థాయి పోటీలలో ఢీకొంటారు. పాల్గొన్న/ గెలిచిన పిల్లలకి ఘనమైన బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో బాటూ, అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళ ప్రతిభ ప్రపంచం నలుమూలలా తెలిసేలా చెయ్యడం జరుగుతుంది. మరి ఎందుకింక ఆలస్యం! మరిన్ని వివరాలకోసం www.siliconandhra.org/manabadi/telugumaatlaata సందర్శించండి, లేదా [email protected] కి కబురు చెయ్యండి.

సిలికానాంధ్ర మనబడి: అజంత భాషయైన మన తెలుగు భాష. అది పెరగాలి, ఎదగాలి, జగమంత వెలుగై మెలగాలి. తెలుగు ప్రాచీన భాష నుంచి ప్రపంచభాషగా మారాలి. దానికి మన తరువాతి తరాలు తయారవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా  ప్రవాస తెలుగువారికి, వారి పిల్లలకి తెలుగుభాష నేర్పించడంలో  మనబడి కార్యక్రమం ప్రసిద్ధిగాంచింది. గత 7 సంవత్సరాలుగా అమెరికాలో 30 రాష్ట్రాలలో వ్యాప్తి చెంది, కెనడా, ఇంగ్లాండ్, ఉక్రెయిన్, హాంగ్ కాంగ్, న్యూజీలాండ్, నార్వే, సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా మరియు కువైట్ దేశాలలోకూడా ఈ కార్యక్రమం వ్యాప్తి చెందింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3000 మంది పిల్లలు మనబడిలో తెలుగు సంపూర్ణంగా వ్రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకుంటున్నారు.

మరిన్ని శీర్షికలు
CTA and NATS together celebrated Sri Jaya Naama Ugadi & Sri Rama Navami