Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
paryaatakam pattani prabhutvaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఏప్రిల్ 25 - మే 01) - శ్రీకాంత్

మేష రాశి
ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద బంధుమిత్రులను కలుస్తారు అలాగే పెద్దల నిర్ణయాల వలన ఇబ్బందిని పొందుతారు. తలపెట్టిన పనులలో ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు వెళ్ళవలసి వస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. పనులలో నలుగురిని కలుపుకొని వెళ్ళండి. విద్యార్థులకు బాగుంటుంది లక్ష్యం వైపుగా మీ ప్రయాణం సాగేలా ప్రణాలిక సిద్దం చేసుకోండి. ఉద్యోగులకు శ్రమతప్పదు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవచ్చును, చాలా విషయాల్లో సర్దుబాటు అవసరం. పనిభారం తప్పకపోవచ్చును నిదానంగా ముందుకు వెళ్ళండి మంచిది. వ్యాపారస్థులకు లబ్దిని పొందుతారు నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. కళారంగంలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది కొత్త పరిచయాలు కలిసి వస్తాయి.


వృషభ రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది వారితో నూతన విషయాల గురుంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు కొంత తికమక ఉంటుంది ఏవైపుగా నిర్ణయం తీసుకోవాలో అర్థంకాకపోవడం చేత స్తబ్దతగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది కాకపోతే పనిభారం ఉండటం చేత కొంత చికాకును పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. వ్యాపారస్థులకు బాగుంటుంది దూరప్రదేశాల నుండి రావాల్సిన సొమ్ముసమయానికి అందుతుంది. కళారంగంలోని వారికి సమయం సరదాగా గడిచిపోతుంది.


మిథున రాశి
ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తీసుకున్న నిర్ణయాల వలన లబ్దిని పొందుతారు. తలపెట్టిన పనులు చివరినిమిషంలో పూర్తిచేస్తారు. పెద్దలతో కలిసి పనిచేయునపుడు మీ ఆలోచనలు తెలియజేయండి అలాగే వారికీ అనుగుణంగా నడుచుకోండి. ప్రయాణాలు చేయవలసి రావొచ్చును. కుటుంబంలో నిదానం అవసరం. విద్యార్థులకు నూతన ఆలోచనలు వస్తాయి అవకాశాలు కూడా కలుగుటకు ఆస్కారం ఉంది సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఒకవార్త కొంత నిరాశను కలిగించేదిగా ఉంటుంది ఉద్యోగం పనులలో ప్రయత్నం పెంచుట మంచిది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. దూరదృష్టితో ముందుకు వెళ్తారు. కళారంగంలోని వారికి పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వాటిమూలాన అవకాశాలు పొందుతారు. 


కర్కాటక రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులు కాస్తా ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యుల సహాకారం తీసుకోవడం వలన కొంత మేలుజరుగుతుంది. ధనమువిషయంలో తీసుకొనే నిర్ణయాల మూలాన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేయుపనులలో నిదానం అవసరం. విద్యార్థులకు పెద్దల నుండి వచ్చు సలహాలను పాటించే ప్రయత్నం చేయుట ద్వార మేలుజరుగుతుంది. ఉద్యోగులకు ప్రయాణాలు తప్పక పోవచ్చును ముందుజాగ్రత్త చర్యలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఊహించని ఖర్చులు కలుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి తమతప్పులు మెడకు చుట్టుకుంటాయి, అనవసరంగా నిందలు పడవలసి వస్తుంది.


సింహ రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద జీవితభాగస్వామి ఆరోగ్యం వలన భాదను పొందుతారు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పనిఒత్తిడి ఉంటుంది ఒక్కొక్కటిగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రుల నుండి వచ్చిన వార్తమూలాన సందిగ్దంలో పడుతారు. తలపెట్టిన పనులలో చికాకులు పొందుట వలన మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది బాగాఆలోచించి పనులను చేపట్టుట ఉత్తమం. విద్యార్థులకు నూతన అవకశాల విషయంలో ఒకస్పస్టత వచ్చుటకు అవకాశం ఉంది. పెద్దలతో ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు బదిలీల విషయంలో ఒకవగాహన వస్తుంది అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది.

 

కన్యా రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడేఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రతిపనిలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే పెద్దల సూచనలు పాటించుట మంచిది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుతారు వాటిని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు పెద్దల సూచనలు నచ్చకపోవచ్చును సర్దుబాటువిధానం కలిగి ఉండుట మంచిది. ఉద్యోగులకు తిప్పలు తప్పక పోవచ్చును అనుకున్న పనులు సమయానికి జరగకపోవడం వలన మాటనుపడవలసి రావొచ్చును. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి కాకపోతే సమయానికి ధనంసర్దుబాటు అవుతుంది. కళారంగంలోని వారికి స్వల్పవిభేదాలు కలుగుట వలన మానసికంగా ఇబ్బందులు పొందుతారు.

 
తులా రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద పెద్దల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వారికి అనుగుణమైన నిర్ణయాలు చేపట్టుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. అనుభవాలు ఉపయోగపడుతాయి రాజకీయపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు చేపట్టిన పనుల వలన ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు గుర్తింపు కోసం చేయుప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది, నూతన ప్రయత్నాలు మొదలు పెడుతారు. వ్యాపారస్థులకు పెద్దల సహాయం అందుతుంది లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి శుభాకర్యములలో పాల్గొనే అవకాశం లభిస్తుంది సమయాన్ని వాటికీ గడుపుతారు. 

 

వృశ్చిక రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద కుటుంబంలో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది, విందులలో పాల్గొనే అవకాశం ఉంది. చిననాటి మిత్రులతో సమయాన్ని గడుపుతారు.  నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టుపనుల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది. విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు అనుకున్న ఫలితాలు రావు అయినను అధికమైన ప్రయత్నం చేయుట మంచిది. సమయాన్ని వృధాచేయకండి. ఉద్యోగులకు ఉద్యోగంలో మాత్రం తోటివారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు సమయపాలన అవసరం ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే నలుగురితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద ఆతిగా ఆలోచించుట తగ్గించి ముందుకు వెళ్ళండి పెద్దల సూచనలు ఉపయోగపడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు అలాగే నూతన నిర్ణయాలు వాయిదా వేయండి. ప్రయాణాలలో విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్త. బద్దకం కలిగి ఉండుట చేత పనులను నష్టపరిచే అవకాశం ఉంది. విద్యార్థులకు విదేశీయాన అవకాశాలు లభించే అవకాశం ఉంది, గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగుంటుంది ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుతారు. అధికారులకు ఉపయుక్తమైన పనులను చేపడుతారు. వ్యాపారస్థులకు పనిభారం ఉంటుంది ఒకేసారి రెండుమూడు విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి అవసరం రావడంతో కొంత ఇబ్బందిని పొందుతారు. కళారంగంలోని వారికి బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది. 


మకర రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద నలుగురితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు అవతలివారికి నచ్చిన పనులను చేపట్టుట చేత మంచిగుర్తింపును పొందుతారు. చిన్న చిన్న అవకాశాలను సైతం వదులుకోకండి. మిత్ర్రుల సహాయసహకారాలు అందుతాయి. విద్యార్థులకు ప్రయత్నం చేయుట వలన ఫలితాలు మంచిగా వచ్చేఅవకాశం ఉంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. దూరప్రదేశం నుండి ఒక వార్తవినే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు పొందుతారు. ప్రణాళిక అవసరం నిదానంగా వ్యవహరించుట మంచిది. కళారంగంలోని వారికి గట్టిగా ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. కొన్ని విషయాల్లో వేచిచూసే దొరని తప్పక మేలుచేస్తుంది.


కుంభ రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద దూరప్రదేశ ప్రయాణాల పరంగా ఆలోచనలు చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు కాకపోతే ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబసభ్యుల ద్వారా తెలువకుండానే నష్టపోయే అవకాశం ఉంది కావున మీ విషయాల్లో వారిని దూరంగా ఉంచుట మంచిది. చిన్న చిన్న విషయాల మూలాన మానసికంగా ఆలోచనలో పడుతారు. విద్యార్థులకు పెద్దల నుండి సహాయం లభిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అలాగే ప్రయత్నం పెంచుట మంచిది. ఉద్యోగులకు మాటపడవలసి రావొచ్చును అలాగే పనిభారం వలన చిరాకును పొందుతారు. వ్యాపారస్థులకు బాగుంటుంది ఆలోచనలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కళారంగంలోని వారు చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు.


మీన రాశి

ఈరోజు మీరు ఈవారం మొత్తంమీద వ్యక్తిగత విషయాలకన్నా సంస్థాగత విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆలోచనలు పెరుగుతాయి అలాగే పనిభారం ఉంటుంది, తలపెట్టిన పనులను చివరకు పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల సహాకారం అందుతుంది. మార్పును కోరుకొనే అవకాశం కలదు. నూతనప్రయత్నాలు ఆరంభిస్తారు. విద్యార్థులకు ఫలితాలు కొంత ఆలస్యంగా వస్తాయి అలాగే ఓపిక ఉండుట మేలుచేస్తుంది. ఉద్యోగులకు ఉద్యోగంలో ఒత్తిడిని కలిగి ఉంటారు నలుగురితో మీ ఆలోచనలను పంచుకుంటారు మంచిగుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది శ్రమను కలిగిఉన్నను ఆశించిన స్థాయిలో లాభం ఉంటుంది. కళారంగంలోని వారికి అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. స్త్రీలకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాటపడవలసి వస్తుంది జాగ్రత్త.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
excess baggage