Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with lakshmi prasanna

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - ప్రతినిధి

movie review prathinidhi

చిత్ర సమీక్ష: ప్రతినిధి
తారాగణం: నారా రోహిత్, సుబ్రా అయ్యప్ప, శ్రీ విష్ణు, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, పోసాని తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత: సాంబ శివరావు
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
విడుదల తేదీ: 25/04/14

క్లుప్తంగా చెప్పాలంటే :

శ్రీను (నారా రోహిత్) వర్తమాన రాజకీయ వాతావరణం పైన, లంచగొండితనం పైన విసిగెత్తి ఉంటాడు. దీనికి చరమగీతం పాడాలని అనుకుంటాడు. అందుకుగానూ, ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఈ కిడ్నాప్ కు మరోమంత్రి కొడుకైన శ్రీఖర్(శ్రీ విష్ణు) సహాయం తీసుకుంటాడు. దేశం మొత్తం ఈ కిడ్నాప్ వార్త విని అవాక్కవుతుంది. ఇంతకీ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసిన శ్రీను డిమాండ్లు ఏమిటి? అతను తన లక్ష్యాన్ని చేరుకుంటాడా? అసలు ఈ శ్రీను ఎవరు? కిడ్నాప్ లో శ్రీఖర్ పాత్ర ఏమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:

నారా రోహిత్, శ్రీ విష్ణు చాలా బాగానే నటించి మెప్పించారు. సుబ్ర అయ్యప్పకు మాత్రం కథలో కీలకమైన పాత్ర ఇవ్వలేదు. ఆమెకు నటించే అవకాశం కూడా పెద్దగా లేకపోయింది. పోసాని కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. కోట శ్రీనివాసరావు తనదైన ముద్రతో సి.ఎం పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే కొన్ని లాజిక్ లేని సీన్లు లేకపోయేవేమో. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాల విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదేమో.

ఏది ఏమైనప్పటికీ ఇది బోరు కొట్టని చిత్రం. అది కూడా ఎన్నికల సీజన్ లో వచ్చిందేమో... ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే : ఈ ఎలక్షన్ల వేడిలోనే చూసేయండి.

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka