Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bengali arundati

ఈ సంచికలో >> సినిమా >>

మే 16న 'బచ్చన్' భారీ విడుదల

may 16th bacchan release

"ట్రాఫిక్, వీరుడొక్కడే"  వంటి విజయవంతమైన చిత్రాల అనంతరం ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "బచ్చన్", ఈగ చిత్రం లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై, అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "బాహుబలి" లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన"బచ్చన్" చిత్రాన్ని అదే పేరు తో మే 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారాయన.

తన కెరీర్ లో తొలిసారిగా "లెజెండ్" చిత్రం లో విలన్ గా నటించిన ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు బచ్చన్ చిత్రం లోనూ ప్రత్యేక పాత్ర పోషించి ఉండడం విశేషం. "భీమవరం టాకీస్" పతాకం పై తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని "శ్రీ వెంకటేశ్వర కృప ఎంటర్  టైనెర్స్" అధినేత ఉదయ్ కె.మెహతా  సమర్పిస్తున్నారు. "మహాత్మ" ఫేం భావన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పరుల్ యాదవ్, తులిప్ జోషి, నాజర్, ఆశిష్ విధ్యార్ధి, ప్రదీప్ రావత్, బొమ్మాళి రవి శంకర్ ఇతర ముఖ్య పాత్రధారులు కావడం విశేషం.

15 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నడ లో రూపొంది.. 30 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు అనువాద హక్కుల్ని ఫ్యాన్సి రేట్ తో సొంతం చేసుకున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారయణ మాట్లాడుతూ.... "ట్రాఫిక్" వంటి సూపర్ హిట్, "వీరుడొక్కడే వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం బచ్చన్ వంటి మరో సూపర్ హిట్ ఫిల్మ్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వాంగా ఉంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్  లోనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నప్పటికి ఎలక్షన్స్ కారణంగా జాప్యం జరిగింది. మే 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. మే మొదటి వారం లో బచ్చన్ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను నిర్వహించనున్నాం. యాక్షన్ తో పాటు, డ్రామా, సస్పెన్స్ మరియు సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని కూడా అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. మే 16 న ఈ చిత్రాన్ని 300 ల థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేఖర్ చంద్రు, సంగీతం: వి హరికృష్ణ , సాహిత్యం: చల్లా భాగ్య  లక్ష్మి, సమర్పణ:  ఉదయ్ కె. మెహతా,  నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: శశాంక్!

        

మరిన్ని సినిమా కబుర్లు
seemandra chinnodu,telangaana anna