Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
may 16th bacchan release

ఈ సంచికలో >> సినిమా >>

సీమాంధ్ర చిన్నోడు, తెలంగాణ అన్నగా ద్విపాత్రాభినయంలో అజిత్

seemandra chinnodu,telangaana anna

తెలుగులో ఇటీవల "ఆట ఆరభం, వీరుడొక్కడే" చిత్రాలలో ఘనవిజయాన్ని సాధించిన అజిత్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "అట్టహాసం" చిత్రాన్ని "నాతో పెట్టుకోకు"గా తెలుగులో అనువదిస్తున్నారు. తమిళంలో నాలుగు చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్న జీ.ఎస్.ఎల్ ప్రొడక్షన్స్ అధినేత జీ.ఎస్ లత తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఈ చిత్రం ద్వారా అడుగుపెడుతున్నారు. తెలుగులో జీ. దేవానందం నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

తమిళ్ లో ఘనవిజయం సాధించిన "అట్టహాసం" చిత్రం హక్కులను కొనడానికి ఎంతో మంది పోటీపడ్డా మేము ఫ్యాన్సీ రేటు పెట్టి ఆ హక్కులను పొందాము. ఈ చిత్రం లో అజిత్ ద్విపాత్రాభినయం చేసారు. అజిత్ కి జోడీగా పూజా నటించింది. అజిత్ ఇందులో సీమాంద్ర చిన్నోడిగా, తెలంగాణ అన్నగా నటించారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని మే నెలలో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు అద్భుతంగా ఉంటాయి.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : వెంకట్, సంగీతం: భరధ్వాజ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శరణ్, నిర్మాణ సారధ్యం: జీ. దేవానందం, నిర్మాత: జీ.ఎస్.లత.

మరిన్ని సినిమా కబుర్లు
the most senior artist naresh!!