Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

బ‌డ్జెట్‌ని అదుపులో పెట్టుకొంటే... లాభాలు రావ‌డం గొప్పేం కాదు! - మారుతి

interview with Maruthi

క‌ప్పుడు మారుతికి సినిమాలు కావాలి!
ఇప్పుడు చిన్న సినిమాల‌కు మారుతి కావాలి!
ఈ స్థాయి ఎద‌గ‌డం వెనుక అలీ బాబా అద్భుత‌దీపాలేం లేవు. మారుతి క‌ష్టం ఒక్క‌టే ఉంది. ఇప్పుడు మారుతి పేరుతో సినిమాలు న‌డుస్తున్నాయి. మారుతి పేరుంటే.. సినిమా గ‌ట్టెక్కేస్తుంద‌న్న న‌మ్మ‌కంతో సినిమాలు మొద‌లువుతున్నాయి. ఈ త‌రంలో చిన్న సినిమాకి స‌రికొత్త ఆశ క‌ల్పించాడు మారుతి. ఆయ‌న‌తో సినిమా తీసిన ఏ నిర్మాతా ఇప్ప‌టి వ‌ర‌కూ న‌ష్ట‌పోలేదు. విడుద‌ల‌కు ముందే నిర్మాత‌కు లాభం రుచి చూపిస్తాడు.. అదే మారుతి స‌క్సెస్ సీక్రెట్‌. థియేట‌ర్ కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడి టికెట్టు రేటు న్యాయం చేస్తాడు.. అదే మారుతి ప్ల‌స్‌! ''బ‌డ్జెట్‌ని అదుపులో పెట్టుకొని సినిమా తీస్తే... లాభాలు సంపాదించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు..'' అంటున్నాడు మారుతి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొత్త‌జంట ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా మారుతితో చేసిన స్పెష‌ల్ చిట్ చాట్ ఇది..!

* ఎలా ఉంది కొత్త‌జంట రెస్పాన్స్‌?
- ఈరోజే క‌దా విడుద‌లైంది.. వ‌రుసగా ఫోన్‌కాల్స్ వ‌స్తున్నాయి. ల‌వ్‌లీ ఎంట‌ర్‌టైన‌ర్ తీశావ్‌.. సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. బ‌య‌ట‌కు వ‌చ్చినంత వ‌ర‌కూ న‌వ్వుతూనే ఉన్నాం అంటున్నారు.

* మీ టార్గెట్ ఆడియ‌న్స్‌కి రీచ్ అయిన‌ట్టేనా?
- నా సినిమాల‌కు యువ‌త‌రం నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. అయితే యూత్ చూస్తేనే స‌రిపోదు. ఫ్యామిలీ మొత్తం రావాలి. అందుకే కొత్త‌జంట సినిమాని కుటుంబ ప్రేక్ష‌కులంతా చూసేలా తీర్చిదిద్దా. ఈ సినిమాకైతే నాటార్గెట్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులూ. వాళ్ల‌కు త‌ప్ప‌కుండా చేరువ అవుతుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది.

* అల్లు శిరీష్ ప్ల‌స్సులూ మైన‌స్సులూ బాగానే ప‌ట్టేశారు?
- అల్లు కుటుంబంతో నాకెప్ప‌టి నుంచో మంచి అనుబంధం ఉంది. శిరీష్ న‌టించిన గౌర‌వం సినిమా నేను చూళ్లేదు. కావాల‌నే ప‌క్క‌న పెట్టా. ఎందుకంటే నేను క‌థ రాసుకొంటున్న‌ప్పుడు ఆ ప్ర‌భావం నాపై ఉండ‌కూడ‌ద‌నుకొన్నా. త‌నేం చేయ‌గ‌ల‌డో నాకు తెలుసు. అత‌ని మైన‌స్సులు ప‌క్క‌న పెట్టి ప్ల‌స్సుల్ని ఎలివేట్ చేయాల‌నుకొన్నా. క‌థ‌కి ఏం కావాలో ఎంత చేయాలో అంతే చేశాడు.

* ఈ సినిమా చూశాక మెగా ఫ్యామిలీ స్పంద‌నేంటి?
- అర‌వింద్‌గారు ఫుల్ హ్యాపీ. బ‌న్నీకి బాగా న‌చ్చేసింది. మ‌నం ఎప్పుడు చేద్దాం అని అడిగాడు. `నీతో ఓ ల‌వ్‌స్టోరీ చేయాల‌ని వుంది..` అన్నాడు. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో..?

* శిరీష్‌పై మీ అభిప్రాయం ఏమిటి?
- న‌టుడిగా ఇంకా ఎదుగుతాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. బ‌న్నీ కూడా అంతే క‌దా? సినిమా సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కాడు. ఇప్పుడు స్టార్ అయ్యాడు. ఆ ల‌క్ష‌ణాలు శిరీష్ లో ఉన్నాయి.

* ఇక మీద‌ట క్లీన్ సినిమాలే తీస్తా.. అన్న‌మాట నిల‌బెట్టుకొన్నారు..
- ఈరోజుల్లో నాకోసం నేను తీసుకొన్నా సినిమా. అది నా ఐడెంటిటీ. బ‌స్‌స్టాప్ మ‌రో త‌ర‌హా క‌థ‌. ఈ రెండు సినిమాల‌కూ కాస్త స్పైసీ అవ‌స‌రం. కాక‌పోతే అది మోతాదు మించింది. న‌న్ను చూసి సినిమాలు తీయ‌డం మొద‌లెట్టిన‌వాళ్లే కాదు... విమ‌ర్శించిన వాళ్లూ ఉన్నారు. అందుకే ఇక మీద‌ట క్లీన్ సినిమాలే తీస్తా.. అని నిర్ణ‌యించుకొన్నా. కొత్త‌జంట తొలి అడుగు.

* మారుతి టాకీస్ బ్యాన‌ర్‌లో కొన్ని బూతు సినిమాలొచ్చాయి..
- నా పేరు క్యాష్ చేసుకోవాల‌న్న ఆత్రుత‌తో కొంత‌మంది అలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక‌మీద‌ట‌.. ఎవ్వ‌రికీ ఈ పేరు వాడుకొనే ఛాన్స్ ఇవ్వ‌ను.

* బూతుల వ‌ల్ల సినిమాలు ఆడ‌వ‌నే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారా?
- ఇప్ప‌టికీ చెబుతున్నా.. బూతుల వ‌ల్ల సినిమాలు ఆడ‌వు. అలాగైతే ఈరోజుల్లో త‌ర‌వాత అలాంటి క‌థ‌లు, ఇంకా ఎక్కువ మోతాదు బూతుల‌తో చాలా వ‌చ్చాయి. అన్నీ ఆడేశాయా? ఏ క‌థ‌లో అయినా ద‌మ్ము కావాలి.

* టేబుల్ ఫ్రాఫిట్ సినిమాలు తీసి పెడుతున్నారు. ఆ ర‌హ‌స్యం ఏమిటి?
- ద‌ర్శ‌కుడిని కాక‌ముందు  చాలా స్థాయిల్లో ప‌నిచేశా. సినిమాని ద‌గ్గ‌రుండి గ‌మ‌నించా. ఎక్క‌డెక్క‌డ వృథాగా ఖ‌ర్చు చేస్తున్నారు? బ‌డ్జెట్ ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలి?  త‌క్కువ డ‌బ్బుల‌తో క్వాలిటీ సినిమా ఎలా తీయాలి? ఇవన్నీ ఆలోచించేవాడిని. అవే ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నా. బ‌స్‌స్టాప్ కి రెండుకోట్ల బ‌డ్జెట్ ఇచ్చారు. పాతిక ల‌క్ష‌లు మిగిల్చా. మిగ‌తా సినిమాల‌కీ అంతే. నాపై న‌మ్మ‌కంతో డ‌బ్బులు పెట్టే నిర్మాత‌ల‌కు అన్యాయం జ‌ర‌క్కూడ‌ద‌నేదే నా పాల‌సీ. ఎందుకంటే... ఒక సినిమా హిట్ట‌యితే .. ఆ దారిలో మ‌రిన్ని సినిమాలొస్తాయి. చాలామందికి బ‌తుకుదెరువు దొరుకుతుంది.

* కొత్త‌జంట‌కు బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్టున్నారు?
- అదేం లేదండీ. అనుకొన్న బ‌డ్జెట్‌లోనే తీశాం. కానీ గీతాఆర్ట్స్ సినిమా అంటే రిచ్‌లుక్ ఆశిస్తారు క‌దా..?? అందుకే కావ‌ల్సిన చోట‌.. ఎక్కువే ఖ‌ర్చుపెట్టాం.

* ఎవ‌రిదో కథ కాపీ కొట్టి రాధా రాసుకొన్నార‌ట‌?
- ఆ అవ‌స‌రం నాకు లేదు. నా ద‌గ్గ‌ర క‌థ‌లు బోలెడున్నాయి. అవ‌న్నీ వ‌రుస‌పెట్టి తీస్తే.. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కూ కొత్త క‌థ రాసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అయినా రాధా క‌థ నేనేం పూర్తిగా రాసుకోలేదు. లైన్ చెప్పానంతే. దాన్నే కాపీ అంటే ఎలా?

* ఇంత‌కీ వెంకీతో సినిమా ఉందా, లేదా?
- ఉంటుంది. కానీ ఎప్పుడో చెప్ప‌లేను. అయితే.. రాధా కాదు. `మ‌రో కొత్త క‌థ చేద్దాం..` అన్నారాయ‌న‌.

* బ‌న్నీతో సినిమా ఉంటుందా?
- బ‌న్నీ నాకు స్నేహితుడే అయినా పెద్ద స్టార్ క‌దా? త‌నకి త‌గిన క‌థ రాగానే త‌ప్ప‌కుండా చేస్తాం.

* ఒకే ఆల్ ది బెస్ట్‌
- థాంక్యూ

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Kotta Janta