Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hindi  paruguku prakaash raj dabbing

ఈ సంచికలో >> సినిమా >>

మే 10న 'లవ్ టు లవ్' విడుదల

may 10th love to love release

కొండపల్లి మూవీ మేకర్స్, కె. లక్ష్మినారాయణ సమర్పించు మనదేశం మూవీస్ పతాకంపై ఆర్య, శ్రియా శరన్, ప్రీతికా రావు హీరో హీరోయిన్లుగా మనికంఠన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం "లవ్ టు లవ్". ఈ చిత్రం లో మొదటిసారిగా ఆర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శ్రియ, ప్రీతికా రావు ఇద్దరు హీరోయిన్స్ చాలా గ్లామర్ గా నటించారు. తమిళనాడులో భారీ వ్యయంతో "కొచ్చాడియాన్" నిర్మాతలు నిర్మించిన చిత్రం, తెలుగులో మనదేశం మూవీస్ పతాకంపై అనువాదమైన చిత్రం "లవ్ టు లవ్" ఈ చిత్రం మే 10న విడుదల చేస్తామని దర్శకుడు మణికంఠన్ తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం హైలెట్ గా నిలిస్తోంది. మధుర ఆడియో ద్వారా ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయని, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తామని సంగీత దర్శకుడు హరిహరన్ తెలిపారు.

ఈ చిత్రంలో ఆర్య, శ్రియాశరన్, ప్రీతికా రవు, సంతానం, నాజర్, వయాపురి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రబోస్, వెన్నెలకంటి, భువనచంద్ర, శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: హరిహరన్, లిస్ లీ లిప్స్, కెమెరా: ఆర్.బి. గురుదేవ్, ఎడిటింగ్: వి.టి.విజయన్, సమర్పణ: కొండపల్లి లక్ష్మినారాయణ, నిర్మాత: వల్లభనేని అశోక్, దర్శకత్వం: మణికంఠన్

 

మరిన్ని సినిమా కబుర్లు
swamy swamy ra ra as sequel of swamy rara