Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Kotta Janta

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రం: అనామిక

Movie Review - Anamika
చిత్రం: అనామిక
తారాగణం: నయనతార, వైభవ్, పసుపతి, హర్షవర్ధన్ రాణె, నరేష్ తదితరులు
సంగీతం: కీరవాణి
కూర్పు: మార్తాండ్ కె వెంకతేష్
కెమెరా: విజయ్ సి కుమార్
నిర్మాతలు: వీకం 18, లాగ్లయిన్ 
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల: మే 1' 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
అనామిక (నయనతార) కనిపించకుండా పోయిన తన భర్త అజయ్ శాస్త్రిని (హర్షవర్ధన్ రాణె) వెతుక్కుంటూ అమెరికా నుంచి హైదరాబాద్ వస్తుంది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ సారధి (వైభవ్) అనే ఎస్సై సాయంతో తన భర్త ఆచూకీ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ అజయ్ ఎమయ్యాడు? అనామిక ఎవరు? మొదలైన విషయాలన్నీ ఉత్కంఠభరితమైన కథనంతో తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
ఇది హిందీ చిత్రం "కహాని"ని చూసి స్ఫూర్తి పొంది తీసినది. నిజానికి "కహాని"లో లేని చాలా పెద్ద కహాని ఈ "అనామిక" లో ఉంది. అంటే చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల వల్ల కొన్ని చోట్ల మూలంలోకంటే బాగుందనిపిస్తే, కొన్ని చోట్ల బెడిసికొట్టింది.

నిజానికి ఈ సినిమాని "కహానీ"తో పోల్చకుండా చూడాలి. కానీ కహానీ చూసిన వాళ్లు పోల్చకుండా ఉండలేరు. అందుకే, ఇది మూలం చూడని వాళ్లకి నచ్చుతుందేమో అనిపిస్తోంది.

నయనతార నటన ఈ సినిమాకి హైలైట్. మిగతా హైలైట్ అంతా కథదే. దర్శకుడు మొదటి సగంపై మరింత ధ్యాస పెట్టుంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనా రెండో సగంతో మార్కులు సంపాదించగలిగారు. వినోదాన్ని ఆశించకుండా ఒక థ్రిల్లర్ ని చూడాలనుకునేవారు ఒకసారి చూడండి.

రెగ్యులర్ శేఖర్ కమ్ముల చిత్రం మాత్రం కాదిది.

ఒక్క మాటలో చెప్పాలంటే: "కహాని" చూడని వాళ్లకి నచ్చుతుంది.

అంకెల్లో చెప్పాలంటే: 3/5
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka