Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with Maruthi

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : కొత్త జంట

Movie Review - Kotta Janta
చిత్రం: కొత్త జంట 
బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌ 
తారాగణం: అల్లు శిరీష్‌, రెజీనా, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రావు రమేష్‌, రోహిణి, మధురిమ తదితరులు 
సంగీతం: జె.బి 
ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌
కూర్పు: ఉద్ధవ్‌
నిర్మాత: బన్నీ వాస్‌ 
దర్శకత్వం: మారుతి 
విడుదల: మే 01, 2014
 

క్లుప్తంగా చెప్పాలంటే:
స్వార్ధమే జీవిత పరమార్ధం అనుకునే యువకుడు శిరీష్ కథ ఇది. ప్రతి వారినీ తన స్వార్ధానికి వాడుకుంటూ బతికేస్తుంటాడు. సువర్ణ (రెజీనా) అనే అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది. చిత్రం ఏమిటంటే ఆమె కూడా స్వార్ధపరురాలే. అయితే శిరీష్ మీద ప్రేమ పెరగడంతో ఆమెలో స్వార్ధం తగ్గుతుంది. కానీ శిరీష్ మాత్రం సువర్ణ తనపై చూపే ప్రేమని కూడా స్వార్ధానికి వాడుకుంటాడు. సువర్ణ శిరీష్ ని తన దారికి ఎలా తెచ్చుంటుందనేది తక్కిన కథ.

మొత్తంగా చెప్పాలంటే:
నిజానికి ఈ సినిమాకి "ఇద్దరు స్వార్ధపరుల ప్రేమకథ" అని టైటిల్ కింద ఉపశీర్షిక తగిలిస్తే బాగుండేది. మొత్తానికి దర్శకుడు మారుతి ఈ సారి బూతుల్లేని నిజమైన ప్రేమకథాచిత్రాన్ని అందించారు. రెజీనా నటన ఈ సినిమాకి ప్లస్. ఆమెను ఎంచుకోవడమే దర్శకుడికి 70% మార్కులు తెచ్చిపెట్టాయి. అల్లు శిరీష్ మాత్రం నటుడిగా ఇంకా సాన పెట్టుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ ని దృష్టిలో పెత్తుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నటన, డ్యాన్సులు, బాడీ లాంగ్వేజ్, డయలాగ్ ఇలా అన్నింటిలో మరింత తర్ఫీదు పొందడం మంచిది. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే తన తొలి చిత్రం "గౌరవం"లో కంటే పరిణతి చూపించాడు. నటుల కోతనుంచి వచ్చాడు కనుక ప్రేక్షకులు అతన్నుంచి ఆశించేది ఎక్కువగానే ఉంటుంది. ఆ అంచనాలు అందుకోవాలంటే శిరీష్ కష్టపడక తప్పదు.

ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా ప్రచారానికి ముందు నుంచీ బాగా వాడుకున్న "అటు అమలాపురం.." రీమిక్స్ మంచి ఫలితాన్నిచ్చింది. సాంకేతిక వర్గం పనితీరంతా బాగానే ఉంది. కమెడియన్ గా సప్తగిరి నవ్వించాడు. మారుతి మార్క్ హాస్యం ఆశించే వారికి అంతగా ఎక్కకపోవచ్చు కానీ, ఒక క్లీన్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి చూడొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే: పర్వాలేదు.

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Anamika