Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kotta sanniveshaalato may9th na sampoornesh mallee vastunnaadu

ఈ సంచికలో >> సినిమా >>

సాంగ్స్ రికార్డింగ్ లో 'సీతారాముల ప్రేమకథ'

songs recordinglo seetaaraamula premakatha

'జగన్ నిర్దోషి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన శివ తదుపరి చిత్రం 'సీతారాముల ప్రేమకథ' త్వరలో ఆరంభం కానుంది. 'వీడు మాములోడు కాదు' ఫేం రవి.కె.శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం సాంగ్స్ రికార్డింగ్ హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్లిఖార్జునరావు మర్రాపు మాట్లాడుతూ - ''ఇది యాక్షన్ తో కూడుకున్న డిఫరెంట్ లవ్ స్టోరీ. రవి.కె.శర్మ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాను. ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నాము. మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది'' అని చెప్పారు.

 

డైరెక్టర్ రవి.కె.శర్మ మాట్లాడుతూ ''శివ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలోని హీరో పాత్రకు యాఫ్ట్ గా ఉంటుంది. ఆయనను చాలా కొత్తగా కనిపిస్తారు. వికాస్ కురిమెళ్ల సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పాటలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నాము. మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. హైదరాబాద్, వైజాగ్, గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసాం'' అని తెలిపారు.

 

ఈ చిత్రానికి మాటలు :   సూర్య కుకునూరు, రచన: వింజుమూరి అచ్యుతరామయ్య, ఎడిటింగ్ : నందమూరి హరి, కథ, నిర్మాత  : మల్లిఖార్జునరావు మర్రాపు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి.కె.శర్మ.

మరిన్ని సినిమా కబుర్లు
kaamaraaju vaastu shaastram