Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaamaraaju vaastu shaastram

ఈ సంచికలో >> సినిమా >>

"మైనే ప్యార్ కియా" నవ్వులు

maine pyaar kiyaa navvulu
ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకట్ రావు, ఉపేంద్ర గిరిడా నిర్మాణంలో వస్తున్న "మైనే ప్యార్ కియా" త్వరలో విడుదలకి సిధ్ధం అవుతోంది. ఇందులో పోసాని, కత్తి మహేష్, వైవా హర్షలపై చిత్రీకరించిన కామెడీ హైలయిట్ అని లోపలి వర్గాల సమాచారం.
 
లవ్, కమెడీ సమపళ్లలో కలిపి తీసిన ఈ చిత్రం ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులకి ప్రైవేట్ గా చూపించారట. చూసిన వారంతా ఈ సమ్మర్ లో వస్తున్న చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అని అంటున్నారు. ప్రతి ఏడాది వచ్చే తెలుగు సినిమాల్లో చిన్న సినిమాలే ఎక్కువ. కానీ వాటిల్లో జనాదరణ పొందేవి తక్కువే. చిన్న సినిమాకి ప్రారంభ వసూళ్లు గొప్పగా ఉండాలంటే టైటిల్, ట్రైలర్ ఊరించేలా ఉనడాలని సూత్రం. ఈ చిత్రం టైటిల్ అలనాటి సుప్రసిధ్ధ హిట్ హిందీ సినిమాది. అక్కడ సగం మార్కులు పడ్డట్టే. దానికి తోడు ముందుగానే వినిపిస్తున్న టాక్ పాజిటివ్ గా ఉంది. 
 
ఇక ట్రైలర్ విషయంలో కూడా జనం దృష్టిని మరల్చుకుంటే రిలీజ్ కి బలం చేకూరుతుంది. దర్శక నిర్మాతలు ఆ దిశగా ఆలొచిస్తారని ఆశిద్దాం. 
మరిన్ని సినిమా కబుర్లు
rajaneekaanth debbaki ...