Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maine pyaar kiyaa navvulu

ఈ సంచికలో >> సినిమా >>

రజనీకాంత్ దెబ్బకి...!

rajaneekaanth debbaki ...

మొత్తానికి ఎలక్షన్ సీజన్ సినిమా పరిశ్రమ నెత్తిపై గట్టిగా మొత్తింది. సాధారణంగా వేసవిలో ఎన్నో సినిమాలు వచ్చి తెరపై వాలతాయి. కానీ ఎన్నికలు, ఆపైన లెక్కింపులు వగైరా అంశాల పట్ల జనం దృష్టి ఎక్కువగా ఉండడంతో పెద్ద సినిమాలు కొన్ని రిస్క్ ఎందుకని వాయిదా పడుతున్నాయి. తాజాగా రజనీకాంత్ కొత్త చిత్రం "విక్రమ సింహ" (కొచ్చాడియాన్) వాయిదా పడింది. నేడు విడుదల కావాల్సిన ఆ చిత్రం అర్థాంతరంగా వాయిదా పడడంతో కొన్ని చిన్న సినిమాల గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. ఎందుకంటే రజినీ సినిమా వస్తోందని ఈ రోజు విడుదల పెట్టుకోకుండా ఆగాయి. కానీ అది కాస్తా వెనక్కి పోవడంతో చాన్స్ మిస్సయ్యమని చిన్న సినిమాలు దిగాలు పడ్డాయి.

అయితే తెలివిగా "ప్యార్ మే పడిపోయానే" మాత్రం ఈ సందర్భాన్ని వాడుకోగలిగింది. రేపు విడుదలవుతున్న ఆ చిత్రం ఏ మేరకు బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam