Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aadityahrudayam

ఈ సంచికలో >> సినిమా >>

ఈ నెల 17న వస్తున్న 'బచ్చన్' చిత్రానికి ప్లాటినం వేడుక!

bacchan platinum function on may 17th

"ట్రాఫిక్, వీరుడొక్కడే" వంటి విజయవంతమైన చిత్రాల అనంతరం "భీమవరం టాకీస్" పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "బచ్చన్", "ఈగ" చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న "భాహుబలి" లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా, "లెజెండ్రీ" విలన్ జగపతిబాబు ముఖ్య పాత్ర నటించిన  బచ్చన్ చిత్రం అదే పేరుతో ఈ నెల 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

వి. హరికృష్ణ సంగీత సారధ్యంలో..  చల్లా భాగ్య లక్ష్మి సాహిత్యంతో రూపొంది.. "వేగా మ్యూజిక్" ద్వారా విడుదలైన బచ్చన్ ఆడియో  మంచి విజయం  సాధిస్తుండడాన్ని పురస్కరించుకుని.. ప్లాటినం  డిస్క్ ఫంక్షన్ను హైద్రాబాద్ లోనీ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి బసవరాజు సారయ్య, దర్శకుల సంఘం అద్యక్షులు వీర శంకర్, తెలగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ అంబరీష్, ప్రముఖ దర్షకులు శివనాగేశ్వర  రవు , సునీల్ కుమార్ రెడ్డి, దర్శకనిర్మాత సాయి వెంకట్, శక్తి రమేష్, బాలాజీ కలర్ ల్యాబ్ రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. "కన్నడ లో ఘనవిజయం సాధించిన బచ్చన్ తెలుగులో మరింత పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.


సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన మరుసటి రోజు.. అనగా మే 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ చిత్రానికి ఫైట్స్  తో పాటూ పాటలు కూడా ప్రత్యేక  ఆకర్షణగా నిలుస్తాయి. అన్నారు. ట్రాఫిక్, వీరుడొక్కడే వంటి సూపర్ చిత్రాల అనంతరం రామసత్యనారాయణ అందిస్తున్న బచ్చన్ కూడా భారీ విజయం సాధించి ఆయనకు హ్యాట్రిక్ ఇవ్వడం ఖాయమని అతిధులు ఆకాంక్షించారు. అనంతరం ప్లాటినం షీల్డులను మాజీ మంత్రి బసవ రాజు సారయ్య చేతుల మీదుగా ప్రధానం చేసారు.

శ్రీ వెంకటేశ్వర కృప ఎంటర్ టైనెర్స్ అధినేత ఉదయ్ కే. మేహతా  సమర్పిస్తున్న ఈ చిత్రం లో.. మహాత్మా ఫేం భావన హీరోయిన్ గా నటించగా . పరుల్ యాదవ్, తులిప్ జోషీ, నాజర్, అశిష్ విధ్యార్ధి,, ప్రదీప్ రావత్, బొమ్మాళి రవి శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : శేకర్ చంద్రు. సంగీతం : వి. హరికృష్ణ. సాహిత్యం : చల్లా భాగ్యలక్ష్మి, సమర్పన : ఉదయ్ కె. మెహతా, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వం : శశాంక్! 

మరిన్ని సినిమా కబుర్లు
completed o manishi katha shoooting