Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin as hreo in karunakaran movie

ఈ సంచికలో >> సినిమా >>

అర్ద శతదినోత్సవ వేడుకల్లో 'లెజెండ్'

legend 50 days celebrations

నందమూరి నటసిం హం బాలకృష్ణ  టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం "లెజెండ్". వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై.. నేటితో (16-05-2014) 50 రోజులు పూర్తిచేసుకుంది. "సిం హ" వంటి సూపర్ సక్సెస్స్ అనంతరం బోయపాటి శీను దర్శకత్వం లో బాలయ్య నటించిన  ఈ చిత్రం.. "సిం హా"  రికార్డులను తిరగరాయడం తో పాటు.. బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్ టైనర్  బాక్సాఫీసు వద్ద కలక్షన్ల సునామీ సృష్టించింది.

మ్యూజిక్ మిస్సైల్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, హీరోయిన్లు సానల్ చౌహాన్ అందం, రాధిక అప్టే అభినయంతో పాటు.. ఫ్యామిలీ హీరో  టర్నుడ్   విలన్ జగపతి బాబు ప్రతి నాయకుడిగా  ప్రదర్శించిన విలనిజం "లెజెండ్" చిత్రానికి మెయిన్ హైలెట్ గా నిలిచింది.  

వీటన్నిటి కంటే ముఖ్యంగా.. బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు బోయపాటి  తీర్చిదిద్దిన విధానం థియేటర్ లో ఆడియన్స్ చేత విజీల్స్ వేయించింది. అలాగే .. క్వాలిటీ విషయం లో ఎక్కడా రాజీ పడకుండా చిత్ర నిర్మాతలు రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర మరియు సమర్పకులు సాయి కొర్రపాటి పాటించిన నిర్మాణ విలువలు "లెజెండ్" చిత్ర విజయం లో కీలక పాత్ర పోషించాయనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.

నేడు "లెజెండ్" చిత్రం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం లోనే కాకుండా .. ఓవర్పీస్ లో కూడా తన సత్తాను చాటి 50 రోజులు నిరాటంకంగా ప్రదర్షింపబడడమే కాకుండా.. 100 రోజుల వైపు వాయు వేగం తో దూసుకెళ్ళుతోంది. 127 సెంటర్లలో "లెజెండ్" చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంధర్బంగా చిత్ర బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేసి .. "లెజెండ్"    చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళు మరియి అబిమానులకు కృతజ్ఞతలు  తెలిపారు.

మరిన్ని సినిమా కబుర్లు
dubbing completed