Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dubbing completed

ఈ సంచికలో >> సినిమా >>

బచ్చన్ భారీ విడుదల!

bacchan grand release!

"ఈగ" ఫేం సుదీప్, లెజెండ్రీ విలన్ జగపతి బాబు, "మహాత్మా"  ఫేం భావన, నాజర్, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్ధి, బొమ్మాలి రవి శంకర్, పరుల్ యాదవ్, తులిప్ జోషి ముఖ్య తారాగణం గా కన్నడ లో రూపొంది ఘన విజయం సాధించిన "బచ్చన్" చిత్రం అదే పేరు తో ఈ నెల 17న తెలుగు లో విడుదలవుతోంది.

భీమవరం  టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం విడుదలను  పురస్కరించుకుని ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాతల మండలి కార్య దర్శి టి. ప్రసన్న కుమార్, మల్లీ డైమన్షన్ వాసు, కాదంబరి కిరణ్, "మీ శ్రేయోభిలాషి" ఫేం ఈశ్వర్ రెద్ది పాల్గొని.. ఈ చిత్రం కన్నడలో సాధించిన ఘనవిజయం తెలుగులో రెపీట్  కావడం తద్యం అన్నారు.

"ట్రాఫిక్", వీరుడొక్కడే వంటి సూపర్ హిట్స్ అనంతరం భీమవరం టాకీస్ నుంచి వస్తున్న ఈ  చిత్రం తో నిర్మాతగా తుమ్మలపల్లి రామసత్య  నారాయణ . హ్యాట్రిక్ కొట్టడం  ఖాయమన్నారు. ఈ నెల 17 శనివారం  ఈ చిత్రాన్ని 300లకు పైగా థియేటర్ లలో విడుదల చేయనున్నామని, అన్ని వర్గాలను అలరించే అంశాలు ఈ చిత్రం లో పుష్కలంగా వున్నాయని, ఇదొక హై ఓల్టేజ్   యాక్షన్ ఎంటర్ టైనర్ అని రామసత్యనారాయణ అన్నారు!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam