Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రెండు జీవితాల‌ను అనుభ‌విస్తున్నా! - శాన్వి

interview with shaanvi

స్లిమ్ అండ్ క్యూట్ ల‌వ్ లీ హీరోయిన్ అన‌గానే శాన్వి గుర్తొచ్చేస్తుంది. చిన్న మొహం, చ‌లాకీ క‌ళ్లు, చురుకైన న‌ట‌న‌...  వెర‌సి తొలి సినిమాతోనే శాన్విని తెలుగు ప్రేక్ష‌కుల‌కు  ద‌గ్గ‌ర చేసేశాయి.  ట్రై చేయ‌కుండానే జీరో సైజ్‌ తెచ్చేసుకొంది శాన్వి!  అప్పుడే కాలేజీ నుంచి స‌రాస‌రి - తెలుగు చిత్ర‌సీమ‌పై కాలు పెట్టేసిందేమో, యువ‌త‌రం క‌థానాయ‌కుల ప‌క్క‌న స‌రిగ్గా ఇమిడిపోతోంది. ల‌వ్ లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే ప‌డిపోయానే - జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెట్టి చూస్తే, ప్ర‌తీ సినిమాలోనూ త‌న‌కు అప్ప‌గించిన పాత్ర‌కు న్యాయం చేసేసింది.

``సినిమాల‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా ఇక్క‌డ అడుగుపెట్టా. న‌ట‌న నాకు కొత్త‌. ప‌రిశ్ర‌మ ఎలా ఉంటుందో అస్స‌లు తెలీదు. నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇక్క‌డ ఏం సాధించినా నాకు బోస‌స్సే... అనే దృక్ప‌థంతో ప‌ని చేస్తున్నా.. అదే నాకు విజ‌యాన్ని తెచ్చిపెడుతుంద‌న్న న‌మ్మకం ఉంది`` అంటోంది. శాన్వి క‌థానాయిక‌గా న‌టించిన ప్యార్‌మే ప‌డిపోయానే ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈసంద‌ర్భంగా శాన్వితో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ శాన్వీ...
- హాయ్‌...

* ఎలా ఉంది ప్యార్ మే ప‌డిపోయానే రిజ‌ల్ట్‌...?
- చాలా బాగుంది. స‌మ్మ‌ర్‌లో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది.

* మీ పాత్ర మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది?
- సెట్స్‌లో ఉండ‌గానే నా క్యారెక్ట‌ర్‌ని బాగా ఎంజాయ్ చేశా. తెర‌పై చూసుకొంటున్న‌ప్పుడు ఇంకా థ్రిల్ అనిపించింది. ఈత‌రం అమ్మాయిల ఆలోచ‌నా ధోర‌ణిని ప్ర‌తిబింబించే పాత్ర‌. కాబ‌ట్టి ఎక్కువ క‌ష్ట‌ప‌డేలేదు. ఒక‌ట్రెండు ఎమోష‌న్స్ సీన్స్ కోసం మాత్రం హార్డ్ వ‌ర్క్ చేయాల్సివ‌చ్చింది.

* ఆదితో రెండో సినిమా ఇది...
- అవును. ఆది చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. చాలా సిన్సియ‌ర్‌. మంచి డాన్స‌ర్‌. ఇంకా చాలా చాలా మంచి ల‌క్ష‌ణాలున్నాయి. అందుకే రెండో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడుకూడా కాద‌న‌కుండా ఈసినిమాకి ఒకే చెప్పేశా.

* ఆదితో పోటీ ప‌డి డాన్స్ చేసిన‌ట్టున్నారు?
- పోటీ అని చెప్ప‌ను గానీ, నాకు నిజంగానే డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇన్‌వాల్వ్ అయి డాన్స్ చేశా.

* ఇంత‌కీ ఈ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి ఏం నేర్చుకొన్నారు?
- క‌ష్ట‌ప‌డ‌డం నేర్చుకొన్నా. నిజంగానే నాకు సినిమాల‌పై ఎలాంటి ఆస‌క్తి ఉండేది కాదు. అనుకోకుండా ల‌వ్ లీలో అవ‌కాశం వ‌చ్చింది. అప్పుడు కూడా సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుసుకొందామ‌న్న ధ్యాస‌తోనే ఒకే చేశా. ఒక్క‌సారి ప‌నిచేయ‌డం మొద‌లెట్టిన త‌ర‌వాత, ఇక్క‌డి వాతావ‌ర‌ణం అర్థ‌మ‌వ్వ‌డం మొద‌ల‌య్యాక‌... ఉంటే సినిమాల్లోనే ఉండాలి అనిపించింది.

* అలా అనిపించ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలున్నాయా?
- సినీ తార‌లంటే ప్ర‌త్యేకంగా చూస్తారు. విప‌రీత‌మైన ఫాలోయింగ్‌. అంత‌కు ముందు శాన్వి అంటే ఎంత మందికి తెలుసు??  అదే ల‌వ్ లీ విడుద‌లైన త‌ర‌వాత ఎక్క‌డికి వెళ్లినా గుర్తుప‌డుతున్నారు. శాన్వి.... శాన్వి.... అంటూ వెంట‌ప‌డుతున్నారు. ఇంత అభిమానం ఎక్క‌డ దొరుకుతుంది?

* ఒక‌వేళ సినీ న‌టి కాక‌పోయి ఉంటే..?
- నేను చాలామంచి స్టూడెంట్‌ని. ఏదో ఓ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ సంపాదించుకొనేదాన్ని. బ్యాంక్ టెస్ట్‌లు రాయాల‌న్న కోరిక విప‌రీతంగా ఉండేది. ఏదోలా ఓ ఉద్యోగం అయితే చేసేదాన్ని.

* దేవుడిపై న‌మ్మ‌కం ఉందా?
- నేను కాశీలో పుట్టా. ప‌విత్ర‌మైన స్థ‌ల‌మ‌ది. దేవుడు నెల‌వైన భూమి. అందుకే నాక్కూడా దేవుడంటే న‌మ్మ‌కం ఎక్కువ‌.

* పండుగ‌ల సెల‌బ్రేట్ చేసుకొంటారా?
- ఓ.... దీపావ‌ళి అంటే చాలా ఇష్టం. హోళీ వ‌స్తే సంద‌డంతా నాదే.

* ఇంట్లో వాళ్ల స‌హ‌కారం ఎలా ఉంటుంది?
- తొలిసినిమాలో అవ‌కాశం రాగానే నాకంటే ఎగ్జెట్ అయ్యింది వాళ్లే. నాపై నమ్మ‌కంతో ఇక్క‌డికి పంపారు. వాళ్ల గౌర‌వం నిల‌బెడ‌తా.

* సినిమాల్లోకి వ‌చ్చీ రాగానే సెల‌బ్రెటీ అయిపోయారు. మీ జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
- ఇప్పుడు రెండు ర‌కాలైన జీవితాలు జీవిస్తున్నా. ఒక‌టి సెల‌బ్రెటీగా. ఎక్క‌డ‌కు వెళ్లినా ఫాలోయింగ్ ఉంటోంది. న‌న్ను అంద‌రూ గుర్తుప‌ట్టి ఆటోగ్రాఫ్‌లు అడ‌గ‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ లైఫ్ ఎంతో బాగుంది. దాంతోపాటు నాకంటూ ఓ జీవితం ఉంది. ఎంత సినీ స్టార్ అయినా స్నేహితుల ద‌గ్గ‌ర మాత్రం మామూలు అమ్మాయినే క‌దా..?  ఆ లైఫ్‌నీ ఎంజాయ్ చేస్తున్నా.

* ఇంత స‌న్న‌గా ఉన్నారు... ఏమీ తిర‌రా?
- అదేం లేదండీ బాబూ. నేనొట్టి తిండిపోతుని. అన్నీ తినేస్తా. చికెన్ అంటే చాలా ఇష్టం. అయితే తిన్న‌వ‌న్నీ ఎక్క‌డికి వెళ్తున్నాయో అర్థం కావ‌డం లేదు.

* అందాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకొంటారు?
- అలాంటివేం నాకు తెలీవు. నార్మ‌ల్‌గా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డ‌తా. మీకో విష‌యం తెలుసా??  సినిమాల్లోకి రాక‌ముందు క‌నీసం కాటుక కూడా పెట్టుకొనేదాన్ని కాదు. స‌హ‌జంగా ఉండ‌డ‌మే నాకిష్టం. అదే అందం. ఆహారం విష‌యంలోనూ మెనూ పాటించ‌ను. ఏది న‌చ్చితే అదే తింటా.

* మీరు న‌మ్మే సిద్దాంతం?
- మ‌న క‌ష్టం మ‌నం ప‌డాలి. మ‌నం చేయాల్సిందంతా చేసి, ఫ‌లితం దేవుడిపై వ‌దిలేయాలి.

* ఎలాంటి పాత్ర‌లు చేయాల‌నివుంది?
- ప్ర‌త్యేక‌మైన ప్లానింగ్‌లు ఏమీ లేవు. నేనున్న ద‌శ‌లో వ‌చ్చిన ప్ర‌తి సినిమా ఒప్పుకోవాలి. ఎంచుకొనే అవ‌కాశం లేదు. కాక‌పోతే అందులో మంచి సినిమాలేంటో తెలుసునే ప‌రిజ్ఞానం సంపాదించాలి.

* సినిమాల్లోకి రాక‌ముందు తెలుగు సినిమాలేమైనా చూసేవారా?
- చాలా చూశా. నేను చూసిన సినిమాల్లో మ‌గ‌ధీర చాలా ఇష్టం.

* ఏ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌నివుంది?
- అంద‌రితోనూ ప‌నిచేయాలి. ముఖ్యంగా పూరి జ‌గ‌న్నాథ్ సార్‌తో చేయాల‌నివుంది. ఇంకా.. మ‌ణిర‌త్నంసార్‌. ఆయ‌నో లెజెండ్రీ ద‌ర్శ‌కుడు.

* బాలీవుడ్‌లో మీ అభిమాన న‌టుడు?
- ర‌ణ‌బీర్ క‌పూర్‌.

* క‌థానాయిక‌ల్లో ఎవ‌రంటే ఇష్టం?
- ప్రియ‌మ‌ణి

* మీరు అనుకొన్న ల‌క్ష్యాల‌ను త్వ‌ర‌గా చేరుకోవాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka