Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tomato pickle

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం(మే 16 - మే 23) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండే అవకాశం ఉంది. వారం చివరలో మీ ఆలోచనలను బంధుమిత్రులతో పంచుకొనే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు  అవకాశం ఉంది. కుటుంబంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదించుట వలన తప్పక మేలు జరుగుతుంది. ఉద్యోగులకు నూతన విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొంత తడబాటు తప్పక పోవచ్చును. వ్యాపారస్థులకు వ్యాపారపరమైన విషయాల్లో శ్రమించుట ద్వార ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవచ్చును సర్దుబాటు అవసరం.  

 

వృషభ రాశి
ఈవారం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. అలాగే ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో కొన్ని కొన్ని విషయాల్లో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది. నూతన అవకాశాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో లబ్దిని పొందుతారు. కళారంగంలోని వారికి నూతన పరిచయాలు కలుగుతాయి సమయాన్ని వారితో గడుపుటకు అవకాశం కలదు.  


మిథున రాశి
ఈవారం మొత్తంమీద ఉత్సాహంతో నూతన పనులలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాల విషయంలో తొందరపాటు వద్దు. దైవసంబంధ పనులకు సమయం ఇవ్వండి. ఉద్యోగులకు అధికారుల వలన చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. అనుభవం ఉపయోగపడుతుంది నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. కళారంగంలోని వారికి ప్రయత్నాలు చేయుట వలన నూతన అవకశాలు పొందుతారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి, మంచిది.  

 


కర్కాటక రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వారం మధ్యనుండి అన్ని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. పనులలో శ్రమను పొందుతారు. వారం చివరలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ధనము చివరి నిమిషంలో సర్దుబాటు అవుతుంది. కాకపోతే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పెద్దలతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వారి అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగులకు నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారస్థులకు ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. సమయంను వృదాచేయకండి. కళారంగంలోని వారికి బాగుంటుంది కాకపోతే పనిభారం తప్పకపోవచ్చును.

 


సింహ రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోకపోవడం సూచన. కొన్ని కొన్ని విషయాల్లో అనవసరంగా ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. కావున సమయస్పూర్తి అవసరం. ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. వాహనముల మూలాన అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఉద్యోగులకు బాగుంటుంది. అధికారులతో గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది. నూతన అవకశాలు లభిస్తాయి.

 

కన్యా రాశి
ఈవారం మొత్తం మీద ఇష్టమైన పనులకు సమయం కేటాయించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను చిన్న చిన్న సమస్యలు పొందినను చివరకు ఉపయోగించే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది మాట పట్టింపులకు పోకపోవడం సూచన. సమయానికి భోజనం చేయుట వలన మేలు జరుగుతుంది. శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది. వాటికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు అధికారుల వలన నూతన పనులను పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాట పట్టింపులు కలుగుతాయి. కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలుగుతాయి నిదానం అవసరం.

 
తులా రాశి
ఈవారం మొత్తంమీద పనులలో ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో ఆలోచనలు చేయునపుడు వారి సూచనలు పాటించుట మంచిది. ప్రయాణాలలో శ్రమను పొందుతారు. చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆవేశపడకుండా సర్దుబాటు విధానం కలిగి ఉండి ముందుకు వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగులు అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిగే మార్పులు కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది. మౌనంగా ఉండుట సూచన. వ్యాపారస్థులకు వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు వద్దు. శ్రమకు తగ్గ ఫలితం పొందుటకు అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలు జరుగుతుంది.

 

వృశ్చిక రాశి
ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు సమయాన్ని ఇస్తారు. వారితో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మాటలు పొదుపుగా వాడుట అనేది సూచన. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో విందులలో పాల్గొనే ఆస్కారం కలదు. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పక పోవచ్చును. అధికారుల వలన మాటను పడవలసి రావచ్చును. కావున నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది. కాకపోతే అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది. వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. కళారంగంలోని వారికి పెద్దలతో ఉన్న పరిచయాలు కలిసి వస్తాయి. సమయస్పూర్తితో మెలగండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  

 

ధనస్సు రాశి
ఈవారం మొత్తం మీద ఆరంభంలో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. సమయాన్ని నచ్చిన విధంగా గడుపుటకు ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు విషయంలో జాగ్రత్త తొందరపాటు వద్దు. ఉద్యోగులకు బాగుంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బదిలీలు అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు సూచన నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది.  ప్రయాణాలు చేయవలసి రావచ్చును. కళారంగంలోని వారికి పనులలో బిజీగా సమయాన్ని గడుపుతారు. అలాగే దూరప్రదేశాలకు వెళ్ళుటకు ఆస్కారం కలదు.

 


మకర రాశి
ఈవారం మొత్తంమీద దైవసంబంధ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు నిర్ణయం చేయకపోవడం వలన మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలించక పోవచ్చును. కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం వలన కొత్త సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. మాటతీరు మార్చుకొనే ప్రయత్నం చేయుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగులకు బాగుంటుంది. అధికారులలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి నిదానంగా వేచిచూసే దోరణి వలన మేలుజరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి మంచిది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది.

 


కుంభ రాశి
ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో నూతన అవకాశాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాకపోతే తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలు జరుగుతుంది. చిననాటి మిత్రులను కలుస్తారు. వారి వలన నూతన అవకశాలు లభించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది. కావున ప్రణాళిక అవసరం. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలు జరుగుతుంది. వ్యాపారస్థులకు పాతపరిచయాల మూలాన నూతన అవకశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెట్టబడులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును. కళారంగంలోని వారికి స్త్రీ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది.


మీన రాశి
ఈవారం మొత్తంమీద పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. స్థిరమైన ఆలోచనలు చేయుటకు ప్రయత్నం చేయండి. పెద్దల సూచనలతో సలహాలతో ముందుకు వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగులకు సూచన సమయపాలన అవసరం అధికారులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది. సోదరుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ధనం విషయంలో సంతృప్తిని పొందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది చేసిన పనులలో మంచి గుర్తింపును పొందుతారు. సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. 


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
chandrodayam