Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
O college droup out  premakatha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

kittugaadu - inter fail.. ias pass

 ఇదేంటిది? కేకులాగా ఉంది?

దీన్ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా కత్తిరించినట్టుంది?

'కేకు" కేకంటారు గానీ,

మా నాయనమ్మ చేసిన తాటి రొట్టె ముందు ఈ కేకులెందుకూ  పని చేస్తాయి?? తాటి పండు బాగా మగ్గిన తరువాత ఆ తాటి టెంకల నుండి గుంజు తీస్తారు. దానిని తాటి "పీసం" అంటారు. స్టైలుగా పలకాలంటే (క్రీం ఆఫ్ ద పాం)ఈ పీసం తియ్యడానికి ఒక పెద్ద పంగల కర్ర తీసుకుని దానికి వలలాగా తాటి నారతో కడతారు. ఆ 'వలకేసి రుద్దితే తాటి పీసం" సునాయాసంగా వచ్చేస్తుంది. దానికి బెల్లం,  బియ్యప్పిండి కలిపి మూకుట్లో వేసి కింద ఆకులు, పైన ఆకులు, కింద మంట, పైన కాలే బొగ్గులు వేసి, రకరకాల మాజిక్కులు చేసి దాన్ని చక్కగా కేకుకి బాబు లాగా తయరుచేస్తారు. కేకుని బేక్ చేస్తారంట. ఇదీ బేకింగే. కాకపోతే వీళ్ళు చేసేది బేకింగ్ అని వీళ్ళకు తెలియదు అంతే!

సరే! ఇంతకీ ఈ రొట్టెముక్కను "పై" అంటారు.

ఈ "పై" బొమ్మని అర్ధం చేసుకుని దాని మీద అడిగే ప్రశ్నలకి  సరైన సమాధానం రాయాలి.

చిన్నప్పుడు కిట్టుని వాళ్ళ తాతయ్య భుజాల మీద కూర్చోబెట్టుకుని , నాయనమ్మతో   బాటు నడుచుకుంటూ దగ్గరలోని ఊళ్ళకి వెళ్ళేవాళ్ళూ. అక్కడ పరిచయ కార్యక్రమాలు వుండేవి.

ఈమె ఎవరు?

మా నాన్నగారి, పెద్దనాన్న గారి, కుమారుడి భార్య యొక్క చిన్న చెళ్ళు. వాళ్ళు ముగ్గురు అప్పజెల్లెళ్ళు... అని చెప్పేవారు.
ఇంత ఇంఫర్మేషన్ ని చాలా తేలిగ్గా అర్ధం చేసుకునే వారు... గ్రామస్తులు

ఈ సివిల్స్ లో కూడా ఎ" కి బి" కి సి" కి   అంటూ తిప్పి తిప్పి ఎవరికి ఎవరు ఏమవుతారో కనిపెట్టమంటారు.

ఇద్దరు పని వాళ్ళు ఒక పనిని రెండ్రోజుల్లో చేస్తే నలుగురు పనివాళ్ళు అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే కబుర్లాడుతూ దమ్మిడీ పని చేయరు అన్నాడంట... అదో జోకు!

ఇలా కాలం, పని, పర్సంటేజి  ఇంకా ఏడో తరగతిలో చేసిన లెక్కలు అడుగుతారంట.

బ్యాంక్  క్లర్కుల ఉద్యోగాలకు పెట్టే పరిక్షల్లో రకరకాల బొమ్మలిచ్చి, తరువాత ఏ బొమ్మ  వస్తుందంటారు. ఉదాహరణకి.. గడియారం బొమ్మ  ఇచ్చి, ముందుగా తొమ్మిది గంటల సమయం చూపించి, తరువాత పన్నెండు, తరువాత మూడు చూపించి ఆ తరువాత ముళ్ళు దేనిమీద వుండాలో ఆ బొమ్మ గుర్తించాలి.

ఇంకేముంది! ఆరు గంటల సమయాన్ని చూపించాలి. అదే సరైన సమాధానం....

ఒక్కోసారి గ్రాఫ్ లిచ్చి  దాన్ని చదివి , సమాధానాలు రాయమంటారు.

ఇదీ  అసలు కథ

కథ  ఐతే కిట్టుకి అర్ధమైంది.

కాని కథ నడిపించడం ఎలా?

ఎందుకూ పనికిరాదనుకున్న 'బియ్యే" డిగ్రీ తోనే సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.

కిట్టూ...

కమలాకర్ కూడా అప్లై చేసాడు.

ప్రిలిమినరీ  (సీసేట్) రానే వచ్చింది. కిట్టు కమలాకర్ ప్రిలిమినరీ పరీక్ష రాసి సాయంత్రం రూమికి చేరుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా ఎవరు మాట్లాడడంలేదు. ఆఖరుకి కిట్టు  అడిగాడు.

ఎల రాసావు కమలా...? చస్తే పాస్ గాను. కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాడు కమలాకర్.

నీ సంగతేంటీ? అని అడిగాడు

మొదటి పేపర్ లో నాలుగు సమాధానాలూ రెండో పేపర్ లో నాలుగు సమాధానాలూ కరక్టుగా పెట్టాను అన్నాడు కిట్టు ..అబ్బో ..చాలా రాసేసావే? అన్నాడు కమలాకర్ ..

దీనమ్మ.. అసలు ప్రశ్నలు అర్ధమై చస్తే కదా కమలా... సరైన సమాధానాలు గుర్తించడానికి? అన్నాడు కిట్టు.

ఐతే మనమిద్దరం రిజల్ట్స్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నమాట. అన్నాడు కమలాకర్.

..అంతే కదా అంతకంటే ఏం జేస్తాం అంటూ సిగరెట్ వెలిగించాడు కిట్టు .. నాయనా.. కిట్టు... సిగరెట్లు తాగి , సివిల్ సర్వెంట్లు కాలేరు. ఇదేదొ ప్రాస బాగానేవుందే అన్నాడు  కిట్టు..

అంటూనే ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు కిట్టు.

ఒరే కిట్టుగా... వెధవనాకొడకా...!

ఊళ్ళో బళ్ళో చదివావు..
 

 తోటలూ , దొడ్ల బండి తిరిగావు..

సరే చిన్న వయసు తెలియదనుకో..

హై స్కూల్ లో చేరిన తరువాత ఏం చేసావు...

అడ్డ రూట్లంటూ స్కూల్ ఎగదొబ్బి...

కాలువల్లో స్నానాలు, నేరేడు కాయలు కోసుకోవడం...

నడిచీ లేదా సైకిల్ పై మళ్ళీ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళేది.. .

ఎప్పుడన్నా సక్రమంగా చదివావా...

ట్యూషన్లకి వెళ్ళి చచ్చావా?

బుద్ది లేదురా నీకు దరిద్రుడా?

పోనీ ఆ కాలేజీ లోనన్నా ఏమన్నా ఏడ్చి చచ్చావా?

అక్కడా మర్నింగ్ షోలు..

అర్ధరాత్రి షోలు...

ఆ తరువాత టైం పాస్..స్టార్ వార్స్ అంట..

రంగు రంగుల ట్యూబ్లైట్లతో కొట్టుకుంటారట వెధవ డిస్కషన్లూ.. నువ్వూ...

జేంస్ బాండ్ అంట..

మూన్ రేకర్ అంట ..

ఇక తెలుగు సినిమాకి లెక్కే లేదు!

గంటల తరబడి "గీతాంజలి" సినిమా మీద డిస్కషన్లు ...

ఆ భాస్కర్ గాడు రెండు మార్కుల కోసం ఏడ్చాడని వాణ్ణి చూసి నవ్వావు....

వాడెంత రైటో ఇప్పుడన్నా తెలుస్తుందిరా... నీకు...

ఆ గుర్నాథం 75 శాతం కోసం ఏడుస్తున్నాడని వాణ్ణి చూసి నవ్వావు...

వాడెంత కరెక్టో ఇప్పటికైన అర్థమవుతుంది రా.. నీకు...?

సైకిళ్ళేసుకునీ, నలుగురినీ కలుపుకుని తాటి చెట్ల కింద పోయి కల్లు తాగే వాడివి!

నీకు సివిల్స్ ఎందుకు రా... కిట్టుగా

వెళ్ళి చెట్టు కింద  తాగి పడుకోరా...!

ఏదో టెంత్ మాత్రం పాసయ్యావు. ... 

ఆ తర్వాత ఏదైన సక్రమంగా పాసయ్యి చచ్చావా ?

లింగు లింగు మంటూ ఏదో బిఏ డిగ్రీ మాత్రం తెచ్చుకున్నావు.

ఆ బియ్యే   లోతుగా ప్రశ్నిస్తే చెప్పగలవా? చెప్పలేవు!

నీ మొఖానికి డ్యాన్సింగ్  గర్ల్స్ తో స్నేహం కావాలా?

ఏదో అదృష్టం బాగుండి ఈ బుల్లి ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది....

లేక పోతే నువ్వెంత.. నీ బతుకెంత...

చిన్న పిల్లల కోసం రాసిన పుస్తకాలు చదివి 

అర్ధం చేసుకోవడానికి నీకు చుక్కలు కనబడుతున్నాయి.

మళ్ళీ పోయి ఆరో తరగతి లో చేరరా.. నికృస్టుడా...

జీవితం లో నువ్వు సివిల్స్ పాస్ కాగలవా?

ఎంత విలువైన సమయం?

గుండెలు బాదుకున్న తిరిగి రానటువంటి

విలువయిన సమయాన్ని ధారాలంగా వృధా చేసావురా కిట్టుగా...

ఇప్పుడు కావాలంటే నువ్వు నాశనం చేసిన ఆ సమయం వస్తుందా?

చదువుకోరా సుబ్బన్న అని అమ్మానాన్నలు డబ్బులిచ్చి, ఫీసులు కట్టి, బట్టలు కొనిస్తే ... ఏం చేసావూ.?

ఆ... చదువు తప్ప అన్ని వెధవ వేశాలు వేసావు.

పరమ మూర్ఖుడిలా ప్రవర్తించావు.

ఇప్పుడు నీకు పోటీ ఎవరో తెలుసురా... నీకు?

"ఆ చదువుకునే సమయం లో బుద్దిగా చదువుకుని.. ఇప్పటికే జ్ఞానం కలిగిన వాడై, మళ్ళీ  ఇప్పుడు  రోజుకు పద్దెనిమిది గంటలు చదువుతున్నవాడు నీకు పోటీ

ముందు అట్టడుగు పాతాళం నుండి నేల మీదకు రావాలి నీవు.

ఆ తరువాత నేలమీద నుండి పైకెగరాలి..."

ఎంత కాలం పడుతుందిరా.. నీకు?

అయినా నీకెందుకు రా... సివిల్స్...

మూసుకుని... బుద్ధిగా దేవుడిచ్చిన ఉద్యోగం చేసుకోరా....

ఇలా పరి పరి విధాల ఆలోచించుకుంటూ మధంపడుతున్నాడు కిట్టు. ఎంతో ఘోరమైన పాపం చేసినంతగా వణికిపోతున్నాడు కిట్టు. లోలోపల కుమిలిపోతున్నాడు...

తనను తాను ద్వేషించుకుంటున్నాడు...

ధూషించుకుంటున్నాడు...

కమలాకర్ నిశ్శబ్ధం గా కిట్టు "విశాద వదనాని" గమణిస్తున్నాడు.

కాసేపాగి అన్నాడు కమలాకర్

కిట్టు... ముఖం కడుక్కో!

ముందు మనం సెక్టార్ టు లో ని మన సీనియర్ ల దగ్గరికి వెళ్దాం. ....

ఆ తరువాత నా ఎంటెక్ ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్ళి, ఇవాళ అక్కడే పడుకుందాం... అన్నాడు కమలాకర్

కిట్టు కదలక పోయేటప్పటికి... పెద్దగా అరిచినట్లుగా అన్నాడు లే ! లే ! బయలుదేరు....

నెమ్మదిగా లేచి నుఖం కడుక్కుని బయలు దేరారు కిట్టు, కమలాకర్ లు

దారిలో చాయి తాగి, దమ్ము కొట్టి, సెక్టార్ టు లో సీనియర్ రూం కి వెళ్ళారు..

రండి, రండి సాదరం గా ఆహ్వానించారు "కనకరాజు" గారు. ఆయన అప్పటికే బుల్లి ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

చుట్టూ లావు లావు గా ఉన్న ఇంజనీరింగ్ పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు...

ఇంకొకాయన బాషా గారు ఒక మూలన కూర్చుని, పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంకో బాషా గారు బయటకు వెళ్ళారట ...
ఏం కమలాకర్! చాలా కాలానికి మా రూం గుర్తుకొచ్చింది మీకు అన్నారు" కనకరాజు" గారు

ఏం లేదు సార్ వి జె టి ఐ  ( విక్టో రియా జూబ్లీ తెక్నాలజికల్ ఇన్స్ టిట్యూట్) కి వెళ్తూ, మిమ్మల్ని చూసి పోదామని నేను, కిట్టు వచ్చాము... అన్నాడు కమలాకర్

అవును. మీరిద్దరూ ఇవాళ 'పరీక్ష" రాసినట్టున్నారు? ఎల  రాసారు? అన్నారు కనక రాజు గారు

కమలాకర్ వెంటనే చెప్పాడు... పోయింది సార్!

కిట్టు ముఖం ఆ ముదం తాగినట్టుంది...

పోనీ లే కమలా ... వచ్చే సంవత్సరం రాయి... అన్నాడు కనకరాజు గారు

"నేనింకా రాయను సార్... దీనికి చాలా అంకితం అవ్వాలి. నాకు ఇంట్లో చిన్న, చితకా ప్రాబ్లంస్ ఉన్నాయి.

నేను ఆల్ రడీ  స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను వస్తుందని ఆశావహంగా ఉంది. అది వస్తే మన రాష్ట్రం పోయి, ఇంటికి దగ్గరగా ఉండి, సెట్లైపోతాను... సర్..." అన్నాడు కమలాకర్.

ఓహ్! కమలాకర్ డిసైడైపోయాడు అనుకున్నాడు కిట్టు.

ఏమండి... మీరు/ అని కిట్టూ వైపు చూసారు కనరాజు గారు...

"కనకరాజు గారిలో ఏదో నిశ్చింత, నిబ్బరం కనిపించి, కనిపించని ఆనందం... ప్రశాంతత...

ఏమిటీ ఆయన ముఖం లో ఇంత కళ?

మీరు కొత్తగా వచ్చారు కదా! మీకు తెలియదు...

"జయసూర్య" గారు "యు పి ఎస్ పి" పాసయ్యారు.... అన్నారు కనరాజు గారు

అంటే ఐ ఏ ఎస్ పాసయ్యారా? జయసూర్య గారు ఎవరు/ ప్రశ్నించాడు కిట్టు

జయ సూర్య గారు కూడ బుల్లి ఇంజనీరే! ఆయన పాసయ్యింది "ఇంజనీర్ సర్వీసులు"

మరి "..యూ పీ ఎస్స్సీ "  అన్నారు? ..యూ పీ ఎస్స్సీ ఒక ఐ ఏ ఎస్ కే కాదు ఇంజనీర్లకోసం కూడా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఇంజనీరింగ్ పరీక్ష పాసయితే మంచి హోదా వస్తుంది. అన్నారు కనకరాజు గారు దీన్నేమంటారు సర్..

"ఐ ఈ ఎస్ అంటే ఇండియన్  ఇంజనీరింగ్ సర్వీస్" వివరించారు కనకరాజు గారు

మీకు తెలుసో... తెలియదో.... "పాలిటెక్నిక్ డిప్లమా పాసయ్యి, బుల్లి ఇంజనీర్లుగా బొంబాయి లో జాయినయ్యి నెమ్మదిగా బీటెక్ పాసయ్యి, ఎం టెక్ కూడా చేసి, ఇంజనీరింగ్ సర్వీసుల్లో మన తెలుగు వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు" అన్నారు కనరాజు గారు

కమలాకర్ అందుకున్నాడు

సార్.... తరువాత స్థానం మీది, మరియు ఇద్దరు భాషా గార్లదీనూ... అన్నాడు

"నాదసలు  పోయిన సంవత్సరమే అయిపోవాలండి.. కొన్ని పొరపాట్లు చేసాను.. రాలేదు... ఈ  సంవత్సరం ఆ పొరపాట్లు దిద్దుకుంటే సెలక్షన్ వస్తుంది" అన్నారు కనరాజు గారు

ఎంత ఆత్మ విశ్వాసం? అది గర్వం కాదు, అహంభావం కాదు! తల బిరుసు అంత కంటే కాదు!ఫలితం ఆశించకుండా కష్టించి,  చదివి, కషటానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కదా... అనే నమ్మకమది. మన తెలుగు వాళ్ళలో ఇంత గొప్ప
వాళ్ళూ ఉన్నారా?

కిట్టూ లో అలజడి మొదలైంది

వీళ్ళ విజయ గాథలు వింటుంటే ధైర్యంగా వుంది గుండె నిబ్బరంగా వుంది.

ఈ లోగా భాషా గారు కూడా వాళ్ళ కబుర్లతో చేరారు.

భాషా గారు మీరేమైనా కోచిగు తీసుకున్నారా? అడిగాడు కిట్టు

భాషా గారిలోనూ అదే ప్రశాంతత....

"ఒక విజేతను విజయం వరిస్తుందని, తాను విజయానికి సమీపంగా వున్నాడని ఆ విజేతకు తెలిసిపోతుంది. చుట్టూ వుండి గమనించే వాళ్ళకు తెలిసిపోతుంది" ఇక్కడ కూడా అదే కనిపించింది కిట్టూకి. 

అబ్బే ఎందుకండి... అవే టెక్స్ట్ పుస్తకాలు ఇంకాస్త లోతుగా, కూలంకశంగా చదివితే చాలు!!" అన్నారు భాషా గారు.

నేను కూడా సివిల్స్ రాసాను... అయితే నా మెయిన్ ఫీల్డ్ ఇంజనీరింగే కాబట్టి సివిల్స్ మీద కేంద్రీకరించకుండా  "ఐ ఈ ఎస్" మీద కేంద్రీకరించాను...." అన్నారు భాషా గారు...

"ఈ లోగా కాయగూరలు తరడానికి ఉపక్రమిస్తూ కనకరాజు గారు అన్నారు.. మీకు కూడా భోజనం తయారు చేస్తాను, ఇవాళ్ళ ..మీ డిన్నర్ ఇక్కడే"

అయ్యయ్యో లేదు సార్ .... మేము వి జె టి ఐ కి పోతున్నాము... అన్నాడు కమలాకర్

సీనియర్లకి బై చెప్పి ఇద్దరు  వి జె టి ఐ కి  వెళ్ళారు.

అక్కడ కమలాకర్ ఫ్రెండ్స్ పేకాటలో నిమగ్నమై ఉన్నారు.

కమలాకర్, కిట్టూ లను కూడా రండి రండి ఆని ఆహ్వానించి కూర్చోబెట్టారు.

ఈ పేకాట లో పడి చదువు సంకనాకవు కదా !

"తమ్ముడూ.... తమ్ముడే  ... పేకాట... పేకాటే...

ఈ బ్యాచ్ లో ఏవొక్కడూ గమ్యాన్ని సాధించకుండా వుండడూ.నువ్వు కూడా కళ్ళార చూస్తావు  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
34th  episode