Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
priya.. ni  meede asaga movie release on june 6th

ఈ సంచికలో >> సినిమా >>

రంగనాథ్ కి ఎన్టీయార్ పురస్కారం

honour of NTR for ranganaath
మాహానటుడు ఎన్టీయార్ పేరుతో జాతీయ అవార్డుతో పాటు యువకళావాహిని సంస్థ ఇచ్చే "ఎన్టీయార్ చలనచిత్ర పురస్కారం" కూడా ఉంది. ఆ పురస్కారాన్ని ఈ ఏడు సుప్రసిధ్ధ నటులు శ్రీ రంగనాథ్ కి ఇస్తున్నారు.

త్యాగరాయ గాన సభలో 26.5.2014 న జరగనున్న ఈ కార్యక్రమానికి చిత్రరంగానికి చెందిన కురు వృధ్ధులు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు విశిష్ట అతిధిగా విచేస్తున్నారు. సినీ నటులు టి చలపతి రావు ప్రశంసాపత్రాన్ని సమర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని సంస్థ నిర్వాహకులు శ్రీ వై కే నాగేశ్వరరావు తెలిపారు.

నాయక, ప్రతినాయక పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్త్ గా గొప్ప ప్రతిభని కనబరిచిన రంగనాథ్ కు ఈ అవార్డు రావడం సముచితమని పలువురు అభిప్రాయ పడ్డారు. నిజమే అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు, టీవీ సీరియళ్లు ...ఇలా బహుముఖీనంగా ప్రతిభను చాటారు శ్రీ రంగనాథ్. 
మరిన్ని సినిమా కబుర్లు
satya - 2 lady as damayanthi