Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
slimed.. How?

ఈ సంచికలో >> సినిమా >>

ఎవరీ లవ్ స్టార్?

Who
పూర్తి భారతీయ  సాంకేతికతతో రూపొందిన యానిమేషన్ చిత్రంగా "విక్రమ సింహ" నేడు విడుదలయ్యింది. రజనీకాంత్, దీపికా పడుకొనె రూపు రేఖల్ని అనుకరించి పాత్రలను తయారు చేసి నటింపచేయడం ఈ చిత్రంలో ప్రత్యేకత. అయితే అవతార్ వంటి భారీ స్థాయి చిత్రాలు చూసేసిన కళ్లకి, అనేకానేక గ్రాఫిక్స్ లో ఎన్నో విడ్డూరాలని చూస్తున్న ఇప్పటి జనానికి ఇది ఎంత వరకు నచ్చుతుంది అనే దానిపై ఉన్న సందేహాలకి నేడు సమాధానం లభిస్తుంది. 
 
అదలా ఉంటే రజనీ కాంత్ "కొచ్చైడయాన్" (విక్రమ సింహ) దారిలో ఇప్పుడు మరి కొన్ని భారతీయ యానిమేషన్ చిత్రాలు వస్తున్నాయి. అందులో ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్లో ట్రెండింగ్ అవుతున్నది "లవ్ స్టార్". నరేంద్ర మోడి విజయానికి, రజని కాంత్ కొచైడయాన్ కి అభినందనలు చెపుతూ వచ్చిన లవ్ స్టార్ పోస్టర్లు ఫేస్ బుక్కులో దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ లవ్ స్టార్?
 
7 సీస్ సంస్థ వారు తయారు చేసిన యానిమేటడ్ హీరో ఈ లవ్ స్టార్. మెగా స్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, రెబెల్ స్టార్...ఇలా అందరు టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ స్టార్లని, ఇంకా మైకేల్ జాక్సన్ ని అనుకరిస్తూ త్వరలో ఒక పాటతో ముందుకు రాబోతున్నాడట. ఆ పాట కూడా అన్ని భారతీయ భాషల కలగాపులగంగా ఉంటుందట.  చూద్దాం అదేమిటో. 
మరిన్ని సినిమా కబుర్లు